• అంగన్వాడిలకు కనీస వేతన చట్టం అమలు చేయాలి.
• టీచర్లకు2లక్షలు , ఆయాలకు1లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అమలు చేయాలి.
• టి. ఏ, డి. ఏ లను అందించాలి.
• కనీస వేతనం 26వేలు ఇవ్వాలి.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
బిఆర్ఎస్ పాలనలో 24రోజుల పాటు అంగన్వాడీ లు చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనా, ప్రస్తుత సి. ఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీనాలను వెంటనే అమలు చేయాలనీ అంగన్వాడీ, టీచర్స్ &హెల్పర్స్ అస్సోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల మమత డిమాండ్ చేసారు.సమ్మెకాలంలో ప్రస్తుత సి. ఎం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఐ. సి. డి. ఎస్. సి. డి. పి ఓ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మమత మాట్లాడుతూ,అంగన్వాడీలా సమ్మె కాలంలో, ప్రస్తుత సి. ఎం టీచర్లకు 18 వేలు, ఆయాలకు 15 వేల వేతనం ఇస్తామని, ఇచ్చిన! హామీని వెంటనే అమలు చేయాలన్నారు.ఉద్యగవిరమణ పొందిన టీచర్లకు 2లక్షలు, ఆయాలకు 1లక్ష రూ “ఇవ్వాలని డిమాండ్ చేశారు .ప్రస్తుతం! రాష్ట్ర ప్రభుత్వం జారి చేసిన జి. ఒ అంగన్వాడీలకు షరాఘతంగా మారిందాన్నారు.అంగన్వాడీలకు బి. ఎల్. ఓ విధులను కేటాయించొదని కోరారు.అంగన్వాడిలా ఇంటి అద్దె, గ్యాస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.సి. ఎం ఇచ్చినా హామీల పై మరో మారు సమీక్షా చేసుకోవని వెంటనే హామీలను అమలు చేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమం లో అంగన్వాడీలు వాణి, నాగలక్ష్మి, శ్యామల,అంజలి,అయేషా,సుధారాణి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply