• ఏక కాలంలో 2లక్షల రుణ మాఫి కాంగ్రెస్ తోనే సాధ్యం.
• 6హామీలు కచ్చితంగా అమలు చేస్తాం.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్రంలో సి.ఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం రైతు ప్రభుత్వమని,కాంగ్రెస్ పార్టీ! ఇచ్చినా హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని టీపీసీసీ కో ఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, అన్నారు. తెలంగాణాలో 2 లక్షల రైతు రుణ మాఫి చేయడానికి కాంగ్రెస్ పార్టీ కాబినేట్ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతూ శనివారం సిరిసిల్ల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద సీఎం, క్యాబినెట్ మంత్రుల చిత్రపటానికి సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలభిషేకం చేయడం జరిగింది.అనంతరం సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు వరంగల్ బహిరంగ సభలో అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని గత బి.ఆర్ ప్రభుత్వం, ఎన్నడు రైతు రుణమాఫీ చేసే ఆలోచనే చేయలేదన్నారు.కాని కాంగ్రెస్ ప్రభుత్వం,ఇచ్చినా మాట నిలబెట్టుకుంటూ రైతులకు అండగా నిలిచింది అన్నారు.రానున్న రోజుల్లో మీగిలిన హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పడండి ప్రకాష్,మాజీ జిల్లా అధ్యక్షులు నాగుల సత్యనారాయణ,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనత, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేల్ముల స్వరూప, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైద్యశివప్రసాద్, గడ్డం నర్సయ్య,ఎల్లే లక్ష్మీనారాయణ, కత్తెర దేవదాస్,రాగుల జగన్,తుంగ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply