• 8 మంది అరెస్ట్.
• 19 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనం,07 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం.
• అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే, వెంటనే సంబంధిత పోలీస్, డయల్100 కి సమాచారం ఇవ్వాలన్న సి. ఐ సదన్ కుమార్.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
సిరిసిల్ల పట్టణం లోని అంబేద్కర్ నగర్ లో ఓ వ్యక్తి ఇంట్లో డబ్బులు పందెం పెట్టుకుని రహస్యంగా పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారం తో శుక్రవారం రాత్రి పేకాట స్థావరం పై దాడులు నిర్వహించినట్లు పట్టణ ఇంచార్జి సి. ఐ సదన్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా సి. ఐ సదన్ కుమార్ మాట్లాడుతూ, పేకాట ఆడుతున్న 08 మంది నుండి 19 వేల నగదు,07 మొబైల్ ఫోన్స్, ఒక ద్విచక్ర వాహనం, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. సులభoగా సంపాదనకు అలవాటుపడి కొంతమంది చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతు ఆభరణాలు, వాహనాలను తాకట్టు పెడుతూ కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారని,వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సి. ఐ పేర్కొన్నారు. పోలీస్ ల ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు నిరహిస్తామని ఎవరైన, గ్యాంబ్లింగ్, బెట్టింగులకు , పేకాట జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటమని హెచ్చరించారు.











Leave a Reply