మున్సిపల్ సాధారణ నిధుల ఖర్చు పై విచారణ జరపాలి.

Published by

on

సిరిసిల్ల మున్సిపాలిటీ.

•  వర్ష కాల ముందస్తు చర్యలో భాగంగా లక్షల రూపాయలు పక్కదారి…?

• ఒకే టెండర్ కు, ఓసారి 5లక్షలు, మరోసారి 10 లక్షలు కేటాయించిన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్.

• మునిసిపల్ సాధారణ నిధుల ఖర్చు పై విచారణ జరపాలని డిమాండ్.

నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

సిరిసిల్ల మునిసిపల్ సాధారణ నిధుల నుండి    అడ్డు, అదుపు,లేకుండా ఛైర్పర్సన్ చేస్తున్న ఖర్చుల పై విచారణ జరపాలని పలువురు సిరిసిల్ల మునిసిపల్ కౌన్సిలర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ,సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ ఇష్టా రీతిగా సాధారణ నిధులు ఖర్చు చేస్తున్నారని అన్నారు.వర్షాకాల ముందస్తు చర్యలో భాగంగా చేపట్టే పనులకు మునిసిపల్ సొంత వాహనాలున్న, నిధులు ఖర్చు చేయడం ఎందుకని ప్రశ్నించారు.వాహనాల రిపేర్ల పేరుతో ,లక్షలు రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు.మున్సిపల్ వాహనాల డీజిల్ ఖర్చులకు ఇష్టరితిగా నిధులను వాడుతున్నారని, మున్సిపల్ లో సాధారణ నిధుల నుండి చేస్తున్న ఖర్చులపై విచారణ చేపడితే పూర్తి విషయాలు వెలుగులోకి వారు పేర్కొన్నారు.  ఫిర్యాదు చేసిన వారిలో కౌన్సిలర్లు ఏ. విజయనిర్మల, ఎన్.జాగిరు శైలు,  సిహెచ్. లలిత,గుండ్లపల్లి రామానుజo, చీటి కీర్తన,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

June 2024
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading