మౌనం వీడండి… ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి.

Published by

on

విద్యార్థినిలకు మహిళ చట్టాల పై అవగాహన కల్పిస్తున్న మహిళా పోలీస్.

• షీటీమ్స్ తో  మహిళలకు, బాలికలకు  భద్రత, భరోసా.

• జిల్లాలోని హాట్స్పాట్ వద్ద  షీటీమ్స్ తో నిరంతరం నిఘా.

• పోకిరీల పట్ల సింహస్వాప్నంల నిలిస్తున్న జిల్లా షీ టీమ్స్  ఎస్పీ అఖిల్ మహాజన్.

నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

మహిళలు, బాలికలు మౌనం వీడీ,ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.

 మంగళవారం జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందాలు కళాశాలలు , పాఠశాలలు తెలంగాణ మోడల్ స్కూల్లు,మహిళలు పని చేస్తున్న ప్రదేశాలు ,బస్టాండ్ లలో  ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో, షీ టీమ్స్,యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ లపై అవగాహన సదస్సులు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…

మహిళలు, బాలికల రక్షణ విషయంలో జిల్లా పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మహిళల పై జరుగు  నేరాల విషయంలో  పోలీస్ శాఖ  కఠినగా వ్యవహారిస్తుందని, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్లు అధిక ప్రాధాన్యత ఇస్తారని  పేర్కొన్నారు. పోలీస్ శాఖ, మహిళా భద్రతకు కొరకు జిల్లా వ్యాప్తంగా  షి టీమ్స్ ఏర్పాటు చేసి  ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థినీలు, యువతులు, మహిళలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. మహిళలు  ముఖ్యంగా సామాజిక మధ్యమాలైన ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇన్ స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని , ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసే సమయంలో, వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.ఎవరైనా ఆకతాయులు మహిళలను,యువతులను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు, యువతులకు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా, నేరుగా పోలీస్ ను సంప్రదించాలని,సంప్రదించలేని వారు షీ టీమ్ నంబర్ 87126 56425,డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని వివరాలు గోప్యంగా ఉంచడతాయని ఎస్పీ వివరించారు.

Leave a Reply

June 2024
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading