• 30ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది.
• సహకరించిన అందరికి ఉద్యమ వందనాలు.
నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రతినిధి.
ఎమ్మార్పిస్ సుదీర్ఘ (30 ఏళ్ల )పోరాట ఫలితమే ఎస్సి “వర్గీకరణ’ అని ఎమ్మార్పీఎస్ జిల్లా కానాపురం లక్ష్మణ్ అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కానాపురం లక్ష్మణ్ మాట్లాడుతూ!పోరాటంలో పాల్గొని, సహకరించి, అమరులైన మాదిగ బిడ్డలందరికి కృతజ్ఞతలు తెలిపారు.పోరాటంలో ఎన్ని ఎత్తు పల్లాలు ఎదురైనా, ఎన్నడు నిరుత్సాహపడలేదన్నారు. సొంతవాళ్లే వ్యతిరేకించిన మొక్కవోని అంకుటిత దీక్షతో మందకృష్ణ మాదిగ పోరాటం చరిత్రలో నిలుస్తుంది అన్నారు.వర్గీకరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఉద్యమాభి వందనాలు తెలిపారు.వర్గీకరణ తో రానున్న రోజుల్లో ఎస్సీ మాదిగ, మాదిగ ఉప కులాలు విద్యా, ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు, అవునూరు ప్రభాకర్, గుండా థామస్, మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్, వెంకట రాములు, పంగ రవి, తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply