నిర్వహణ “కంపు కొడుతోంది”

Published by

on

సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాటు పరిసరాలలో  దుర్గంధం వెదజళుతున్న మున్సిపల్ నిర్మించిన మర్డర్  టాయిలెట్స్ 

• గాడి తప్పిన సిరిసిల్ల మున్సిపల్ “పాలన’

• ఫిర్యాదు చేస్తేనే విధులు నిర్వహించని మునిసిపల్  సిబ్బంది,అధికారులు.

• పర్యవేక్షణ మర్చిపోతున్న “సిరిసిల్ల మున్సిపల్ అధికారులు’.

నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

” పట్టణం లో పారిశుద్ధ్య సమస్యలు” ఉన్నాయని ప్రశ్నించే వారు లేకపోవడం తో

సిరిసిల్ల గంగమ్మ గుడి పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి.ప్రభుత్వం!  నిర్దేశించిన విధులను నిర్వహిచాల్సిన  మునిసిపల్  ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది,పిర్యాదు అందితేనే స్పందిస్తాం అనే విధంగా వ్యవహారిస్తున్నారు.గత 6 నెలల నుండి పట్టణంలో సిరిసిల్ల మున్సిపల్  నిర్వహించాల్సిన  విధులు గాడి తప్పాయి.జనాభా కు అనుగుణంగా CDMA ఆదేశాల మేరకు పారిశుధ్య సిబ్బందిని నియమించుకున్న,పట్టణo లోని పలు ప్రాంతాలు “కంపు కొడుతున్నాయి.గత 20సం “రా ల క్రితం ఆయా వార్డులకు కేటాయించిన పారిశుద్ధ్య కార్మికులు,  ఒక వారం డ్రైనేజీల శుభ్రత, మరోవారం చెత్త సేకరణ, నాలుగు వారాలు, వివిధ రూపాలలో వార్డులను శుభ్రపరిచేవారు.  కానీ! నేడు పారిశుద్ధ కార్మికులు వారి విధులను విస్మరిస్తున్నారు, విస్మరిస్తున్నారు అనేకంటే  నిర్వహించే వారి అలసత్వమే కార్మికులు బద్ధకస్తులుగా మారడానికి కారణమని చెప్పక తప్పదు. ఈ స్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో వార్డుల శుభ్రతకు ప్రజలు దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తుందేమోనని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే డబ్బును నెల నెల వేతనంగా పొందుతున్నామని, ప్రజల కోసం ప్రభుత్వం కేటాయించిన విధులను సక్రమంగా  సిరిసిల్ల మున్సిపల్ అధికారుల నిర్వర్తిస్తారా??? పారిశుద్ధ్యం గాడిన పడుతుందా??? ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Leave a Reply

August 2024
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading