మా నాన్నను ఆదుకోండి….. ప్లీజ్.

Published by

on

భాధితుడు సంజీవ్ ఫైల్ ఫోటో.

• మెదల్లో రక్తం గడ్డ కట్టి ప్రాణాపాయ స్థితి లో హాస్పిటల్ లో ఉన్న తండ్రి.

• వైద్యానికి 4లక్షలు అవసరమంటున్న వైద్యులు.

• చేతిలో చిల్లి గవ్వ లేక ఆపన్న హస్తం కోసం చూస్తున్న బాధితుని భార్య, 3ఆడపిల్లలు.

నేటి భారతం'( ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

 

విధి ఎప్పుడు ఎవరిపై పంజా విసురు గుతుందో, ఆ పంజా దెబ్బకు కుటుంబాలు ఎలా కకవికలమౌతాయో ఎవరికి తెలియదు.  అలా విధి విసిరిన పంజాకు ఓ నిరుపేద కుటుంబం వీధిన పడింది. ముగ్గురు ఆడపిల్లలు అ కుటుంబం ఎవరైనా దయామయులు ఆదుకొని వారి తండ్రికి ప్రాణ బిక్ష పెట్టాలని కోరుతున్నారు. బాధితుని భార్య తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 22వార్డ్ కు చెందిన పంగ సంజీవ్ కు భార్య వజ్రవ్వ (3) ముగ్గురు కూతుర్లు. దినసరి కూలీగా పని చేస్తున్న సంజీవ్ ఎప్పటిలాగే తన పనులు ముగించుకొని, ఇంటికి వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి వాహన పై నుండి కింద పోడడంతో తలకు తీవ్ర గాయమై మెదడులో రక్తం గడ్డ కట్టి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో  తెలిసినవారి సహాయంతో  సంజీవ్ ను కరీంనగర్ లోని వజ్ర హాస్పిటల్ లో చేర్పించారు.  వైద్యులు పరీక్ష చేసి వైద్యం చేయడానికి నాలుగు(4 )లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారని, రెక్కాడితే గాని  రోజు గడవని మాకు నాలుగు(4) లక్షల రూపాయలు ఎవరు ఇస్తారని రోధిస్తోంది. ముగ్గురు ఆడకూతుళ్ళతో ఏం చేయాలో తోచక తెలిసిన వారిని ఆదుకోవాలని ఏడుస్తోంది.ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తన భర్తను పెద్ద మనసుతో ఆదుకోవాలని, తోచిన విధంగా సాయం అందించాలని ప్రాధేయ పడుతోంది. సాయమందించే వారు 9989128863 నెంబర్ కు గూగుల్ పే,ఫోన్ పే చేసి ఆదుకోవని వేడుకుంటుంది.

Leave a Reply

September 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading