నిర్ణీత సమయానికి విగ్రహాలను తరలించాలి.

Published by

on

• భక్తిశ్రద్ధలతో నిమజ్జనం వైభవంగా చేపట్టాలి.

• సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ.

నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం ):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

నిర్ణీత సమయానికి వినాయక విగ్రహాలను తరలించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఈ నెల 17న (మంగళవారం)   జిల్లా కేంద్రంలో  నిర్వహించే గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లను నేడు పరిశీలించారు.

అనంతరం,ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ,వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అధికారులు సూచించిన మేరకు సౌండ్ బాక్స్లు పెట్టుకోవాలని ఆదేశించారు.నిమజన్న వేడుకల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వీరి వెంట సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసహత్ అలీ బేగ్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

September 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading