జనవరి 20/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి రాష్ట్ర వ్యవసాయ,సహకార, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ తెలిపారు.సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల మున్సిపాలిటీ ద్వారా UIDF (UIDF =అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) 18 కోట్ల 70 లక్షలనిధులతో సిరిసిల్ల లోని వరద కాలువలకు శాశ్వత పరిష్కారం చూపానుందని తెలిపారు.గత ప్రభుత్వం 8లక్ష కోట్ల అప్పు విధించినా, ప్రజా పాలనలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ఇవ్వని హామీలను సైతం నేర్వేరుస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అని కొనియాడారు.రేపు చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, సీనియర్ నాయకులు వైద్య శివప్రసాద్,ఎల్లే లక్ష్మీనారాయణ,నీలి రవీందర్, పోచమ్మ గుడి ఛైర్మెన్ గొల్లపల్లి పర్శరామ్,గుజ్జే రమేష్, సిరిసిల్ల వ్యవసాయకమిటీ డైరెక్టర్ నక్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply