
జనవరి 24/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియంత్రణ పట్ల అవగాహన కలిగి ఉంటే గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవచ్చని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే. అన్నారు.శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద సిరిసిల్ల పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అలైవ్ – అరైవ్ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ,ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ప్రాణాలు విలువైనవని ద్విచక్ర వాహనం పై ప్రయాణించేప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని కోరారు.సెల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మనతో పాటు ఇతరులు, ప్రమాదలకు గురవుతారని తెలిపారు.రోడ్డు పై ప్రయాణించేప్పుడు ప్రతి పౌరుడు బాధ్యత గా వ్యవహారించాలన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు గోల్డెన్ అవర్ అత్యంత కీలకమైనదని,ప్రమాదం సంభవించినప్పుడు సెల్ఫోన్లో చిత్రీకరించకుండా బాధ్యతగా క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లాలని,అలా ఆసుపత్రికి తీసుకెళ్లిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహంగా 25000 నగదు అందిస్తుందని తెలిపారు.రోడ్డు భద్రత పట్ల పోలీస్ శాఖ నిరంతరంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతుందిని ప్రజలు గమనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి నాగేంద్ర చారి, పట్టణ సీ.ఐ కృష్ణ,ఆర్. ఐ సురేష్,ట్రాఫిక్ ఆర్. ఎస్. ఐ దిలీప్, సిబ్బంది,విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.











Leave a Reply