డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు.

Published by

on

రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయిస్తున్న  ఇన్స్పెక్టర్ రజనీ దేవి.

జనవరి 31 /26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

 రోడ్లపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపొద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పి చంద్రయ్య అన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా  రోడ్డు రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ ఆధ్వర్యంలో భద్రత మాసోత్సవ ముగింపు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వెయ్యి మంది విద్యార్థులతో సిరిసిల్ల బతుకమ్మ ఘాటు నుండి అంబేద్కర్ చౌక్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేసి, ఏఎస్పి చంద్రయ్య మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపద్దని అన్నారు. అనుభవం లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం కావద్దని కోరారు. నిర్లక్ష్యం డ్రైవింగ్ వల్ల మీతో పాటు ఎదుటివారికి కూడా ప్రమాదం అని సూచించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే జరిమానాలు చెల్లించక తప్పదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రోడ్డుపై వాహనాలు నడుపుతూ ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోడ్డు రవాణా శాఖ ఇన్స్పెక్టర్ పృథ్వీరాజ్ వర్మ, రజనీ దేవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

January 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading