కేటీఆర్ ఓటమిని ఒప్పుకున్నాడు.

Published by

on

జనవరి 31 /26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ తన ఓటమిని ఒప్పుకున్నాడని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కె. కె మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  కె. కె మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రజా పాలన విశ్వసిస్తూ ప్రజలు గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 68% కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని అన్నారు. 9 సంవత్సరాలు మంత్రిగా, 17 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండి, కేటీఆర్  చేసింది శూన్యమని తెలిపారు. కేటీఆర్ సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటమిని అంగీకరించి, అహంకారాన్ని తగ్గించుకొని, ఈరోజు సిరిసిల్లలో నిద్రిస్తున్నాడని అన్నారు.బి ఆర్ ఎస్ గత ఎన్నికల్లో బతుకమ్మ చీరల పేరిట బ్లాక్ మెయిల్ చేసి, ఓటు వేయించుకొందని, నైతిక కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, గెలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు పోకుండా నేతన్నలకు చేతి నిండా పని అందిస్తుందని తెలిపారు. పద్మశాలిల ఆత్మగౌరవాన్ని పెంపొందించే విధంగా, ఉపాధి పెంపొందించడానికి,యారం డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇచ్చిన, అంతా అవినీతేనని కాని ప్రజా పాలనలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, రేషన్ కార్డులు అందించామన్నారు. సిరిసిల్ల బాగుపడాలంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీ, గొల్లపల్లి పరుశరాములు, కాసర్ల రాజు, నేరెళ్ల శ్రీకాంత్, గోనె ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

January 2026
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading