మోఢీ ప్రభుత్వంలోనే మహిళల పై హత్యాచాలు.

Published by

on

• సిరిసిల్లా పట్టణ మహిళ కాంగ్రేస్ అధ్యక్షురాలు కాముని వనిత.

నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.

మోఢీ ప్రభుత్వంలోనే మహిళల పై హత్యాచాలు ఏక్కువైయ్యాయని సిరిసిల్లా పట్టణ మహిళ కాంగ్రేస్ అధ్యక్షురాలు కాముని వనిత అన్నారు.సోమవారం పట్టణంలోని పార్టి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, కర్ణాటక  రాష్ట్రంలోని హసన్ పార్లమెంట్ సభ్యుడు  ప్రజ్వల్ రేవణ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.పార్లమెంట్ సభ్యుడయ్యుండి ఓ మహిళను లైంగిక వేదింపులకు గురిచేయడం సిగ్గుచేటన్నారు.బిజెపి మోఢీ ప్రభుత్వంలోనే మహిళల పై లైంగిక వేధింపులు ఎక్కువైయ్యాయని,అయిన మోఢీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వారి చిత్తశుద్దికి నిదర్శనమన్నారు.మొన్న మణిపూర్ ,నిన్న కర్ణాకట,రేపు ఎం జరుగుతుందోనని మహిళలు భయబ్రాంతులకు గురౌతున్నారని పేర్కొన్నారు.ఓ పార్లమెంటేరియన్ పై తీవ్రమైన  ఆరోపణలు జరిగిన, నేటి వరకు ఎలాంటి దర్యాప్తు చేయకపోవడం,మహిళల పట్ల మోఢీ ప్రభుత్వానికున్న గౌరవమేంటో  అర్థమౌతుందని దుయ్యబట్టారు. ఈ హేయమైన చర్యలకు బాధ్యులైన ప్రజ్వల్ రేవణ్  ను భారత దేశానికి రప్పించి విచారణ చేపట్టి,తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షురాలు లత , మండల వైస్ ప్రెసిడెంట్ జ్యోతి, భారతి ,శోభా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

May 2024
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading