

• రాజన్న ‘గుడి’ రోడ్జు వెడల్పులకు గ్రహణం.
• ప్రతిపాదించి 6 ఎళ్ళు గడుస్తున్న… అచరణ శూన్యం.
• పట్టించుకొని పాలకులు…పాట్లు పడుతున్న ప్రజలు.
• అన్ని తెలిసిన “ఆది” తో నైనా మోక్షం లభించేనా…?
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
‘రాజన్న’ నన్ను సర్పంచ్ ను చేయ్ ,సర్వేశ్వర నాకు జెడ్పి చైర్మన్ గా అవకాశం ఇప్పించు, నీలకంఠ నన్ను ఎమ్మేల్యేగా ఆశీర్వదించూ, మొన్నటికి మొన్న సాక్షాత్తూ దేశ ప్రధానియే వచ్చి అ అర్థనారీశ్వరుని ఆశీస్సులు పొంది, మూడవ సారి కూడ తానే ప్రధానిగా పాలించే అవకాశం ఇప్పించాలని కోరి ఉండవచ్చు. ఇలా ప్రజలకు సేవలందించే నాయకులందరు అ సర్వేశ్వరున్ని కొర్కేలు తీర్చమని కోరడమే తప్ప!మంజునాథుడు భక్తుల ప్రియుడని,ఆయన భక్తులకు,ఆయనను కొలిచేవారికి, ఆయన అశీస్సుల కొరకు దేశం నలుమూలల నుండి వచ్చే వారికి, ఆయన సన్నిధిలో, సరైనా సదుపాయాలు,రవాణ సౌకర్యాలు కల్పిస్తే సాక్షాత్తు అ పరమ శివుడి దీవేనలు ఏల్లప్పుడు ఉంటాయనే విషయాన్నే మరచిపోయినట్టున్నారు నాయకులు.ఓ నాయకుడు రాజన్న గుడి అభివృద్దికి 100 కోట్లు కేటాయిస్తామని హామి ఇచ్చిన మాటే మరిచారు.ఇలా రాజన్న సన్నిధికి అనేక మందిమంత్రులు,ఏమ్మేల్యేలు,నాయకులు ,అధికారులు వచ్చి వెళ్ళినా,ఇచ్చిన హామీలు హామిలుగానే మిగిలిపోయాయి.రాజన్న గుడి కి ప్రధాన సమస్య! రాజన్న సన్నిధి నుండి మూలవాగు వంతెన వరకు ఉన్న ఇరుకైనా రోడ్డు.
ఆచరణ సాధ్యమే..అయిన అలసత్వమే..?
రాజన్న సన్నిధికి భక్తులు చేరుకోవడానికి ప్రస్తుతం ఉన్న 30′ పీట్ల రోడ్డు గత30 ఏళ్ళ క్రితం సౌలభ్యంగానే ఉన్న, వేములవాడకు దేశ నలుమూలల నుండి భక్తులు రావడంతో పోట్టెత్తడంతో అ రోడ్డు నేడు తీవ్ర సమస్యగా మారి, భక్తులకు అనేక ఇబ్బందులు కలిగిస్తుంది.ఈ సమస్యను గత ప్రభుత్వ పాలకులు గమనించి,పరిష్కారానికై రోడ్డు వెడల్పులు 80′ ఫీట్లు చేయాలని అమోదం తెలిపినా, నేటికి అ సమస్య “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” అన్న చందంగా మారింది.అర కి.మీటర్ ఉన్న రాజన్న సన్నిధి రోడ్డు ను వెడల్పులు చేయదలిస్తే 229 ఇళ్ళు స్వల్పంగా ప్రభావితమవ్వగా,150 ఇళ్ళు పూర్తిగా ప్రభావితమౌతున్నాయి.ఈ రోడ్డు వెడల్పుల కార్యక్రమానికి 35 కోట్లు అవసరమని నిపుణులు తెలపగా,G.NO:RTNO:789,04/10/2023 లేఖ ద్వారా నిధులు మంజూరి అయినట్లు సమాచారం.ఇదిలా ఉండగా రోడ్డు వెడల్పులకు మార్కింగ్ సైతం చేసినట్లు వేములవాడ పురపాలసంఘం అధికారులు తెలిపారు.ఈ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టడానికి దాదాపు అన్ని వనరులు సమకూరినా! ముందుండి కార్యాన్ని నడిపించాల్సిన నాయకుడు మాత్రమే కావాలి. రాజన్న దివేనలతో గుడి చైర్మన్ గా,ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా,వేములవాడ ఎమ్మేల్యేగా ఉన్న ఆది శ్రీనివాస్ కు ఈ మహత్తర అవకాశం కలిసి వచ్చింది.మరి ‘ఆది” ఈ కార్యాన్ని పూర్తి చేసి ‘రాజన్న’ ఆశీస్సులు పొందేనా? రోడ్డు వెడల్పులు జరిగి రాజన్న భక్తుల సమస్య తీరుతుందో లేదో వేచి చూడాలి.











Leave a Reply