నేటి భారతం( ప్రశ్నించగా పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
మహిళల్ని అవమానించింది బిఆర్ఎస్ పార్టెనని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కో కన్వీనర్ కనిమేని చక్రధర్ రెడ్డి అన్నారు. నిన్నటి రోజు అసెంబ్లీలో జరిగిన విషయంపై ధర్నాలు చేయాలని కేటీఆర్ పిలుపునివ్వడాన్ని ఖండిస్తూ, సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మహిళలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించింది కెసిఆర్ కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు.బిఆర్ఎస్ పాలనలో ప్రధాన ప్రత్యక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని చిన్న భిన్నం చేయడానికి, మంత్రి పదవి ఆశ చూపి, సబితా ఇంద్రారెడ్డిని బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంది కెసిఆర్ కాదా అని అన్నారు.గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం లో, రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నప్పుడు, సబితా ఇంద్రారెడ్డి సాయం అందిస్తానంటూ మోసం చేశారని గుర్తు చేశారు.ఆమె పార్టీ మారడం వల్లనే అప్పటి కాంగ్రెస్ పార్టీ కి ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందని పేర్కొన్నారు. సబిత ఇంద్రారెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పిదం ఏమీ లేదని, ఆమె చేసింది సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారని అన్నారు.ఈవిషయంలో బిఆర్ఎస్ తీరును ఖండిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్య శివప్రసాద్,ఎల్లె లక్ష్మీనారాయణ,వెలుముల తిరుపతిరెడ్డి,మ్యాన ప్రసాద్,తదితర పాల్గొన్నారు.











Leave a Reply