నేటి భారతం (ప్రశ్నించడం పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
అక్క అన్నందుకు అక్కసు చూపెడతరా..?
అక్క అని సంబోదించి గౌరవిస్తే అవమానించారని నిందలేస్తరా అని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ కార్యదర్శి కల్లూరి చందన పత్రిక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.నిన్నటి ఈరోజు అసెంబ్లీలో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయండని, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునివ్వడాన్ని ఖండించారు. ఇదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశంలో డీకే అరుణను సిగ్గులేదా? అని అవమానించలేదా అని గుర్తు చేశారు.సభా మర్యాదలను పాటిస్తూ కాంగ్రెస్ పార్టీ సభను నడిపిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలని సభను రాద్దాంతం చేస్తున్నారన్నారు. సబితాను అక్కలా భావించానని, నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని, తాను బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయిందని సీఎం చెబుతుంటే అవమానించారని, టార్గెట్ చేశారని గగ్గోలు పెట్టడం హేయమని చర్య అని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రజలు గమనిస్తున్నారని, స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ బిల్లు తెస్తే మద్దతివ్వకుండా అసెంబ్లీ నుంచి వాకాట్ చేసిన బీఆర్ఎస్ ను ప్రజాక్షేత్రంలో ప్రజలే శిక్షిస్తారని దుయ్యబట్టారు. సిరిసిల్లో చీర లు తయారు చేయకుండా సూరత్ నుంచి ఎందుకు తెప్పించారో సిరిసిల్ల ఎమ్యెల్యే కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ప్రతిపక్ష పార్టీగా అసెంబ్లీలో బీఆర్ఎస్ విఫలమైందని ప్రకటనలో పేర్కొన్నారు.











Leave a Reply