నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
సివిల్ కేసు లలో కోర్ట్ ఆర్డర్ లను నిర్లక్ష్యం చేస్తూ చట్టాలను అపహాస్యం చేస్తున్న జిల్లా లోని పలువురు పోలీస్ ల పై కోర్ట్ లలో ప్రైవేట్ కేసు లు వేస్తామని సిరిసిల్ల బార్ అస్సోసియేషన్ అధ్యక్షులు సంజీవరెడ్డి అన్నారు.బుధవారం సిరిసిల్ల బార్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పోలిసుల వైఖరి ని నిరసిస్తూ, విధులను బహిష్కరించి అంబేద్కర్ చౌక్ వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు. అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ,సివిల్ కేసులలో, కోర్ట్ అర్డర్ ను పక్కన పెడుతూ, జిల్లాలోని పలువురు పోలీసులు చట్టాలను కోర్ట్ ల ను అపహాశయం చేస్తున్నారని అన్నారు. భారత దేశంలో న్యాయస్థానాలే “సుప్రీమన్న’ విషయం పోలీసులు గుర్తించాలన్నారు. కోర్టులు ఆదేశించిన ఆదేశాలను ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు తుచా తప్పకుండా అమలు చేయాలని తెలిపారు .కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తున్న జిల్లాలోని పలువురు అధికారులపై కోర్ట్ ల లో ప్రవేట్ కేసులు వేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.











Leave a Reply