* టీపీటీఫ్ ఆధ్వర్యం లో సబ్జెక్టు శిక్షణా తరగతులు.
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
స్కూల్ అసిస్టెంట్ లుగా పదోన్నతి పొందిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు టీపీటీఫ్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో సబ్జెక్టు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ! ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా ఉండాలని ,అనుక్షణం సబ్జెక్టు లో మెలకువలు నేర్చుకున్నప్పుడే బోధనలో నూతనత్వం ఉంటుందని తెలిపారు.ఈ శిక్షణలో టీపీటీఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దోర్నాల భూపాల్ రెడ్డి ,దుమాల రమానాథ రెడ్డి,జిల్లా నాయకులు మల్లరపు పురుషోత్తం,సత్తు రవీందర్, విక్కుర్తి అంజయ్య,పురెల్లి రవీందర్,బండి ఉపేందర్,మైలరం తిరుపతి,రవిబాబు, 60మంది ఉపాధ్యాయులు ,10 మంది రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.











Leave a Reply