అంగన్వాడీల సమస్యలను పరిష్కరించండి.

Published by

on

 

నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో,అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా డి డబ్ల్యు ఓ లక్ష్మీరాజ్యం,  ఐసిడిఎస్ సిడిపిఓ సబితల కు  వినతి పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా  అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల మమత మాట్లాడుతూ,అంగన్వాడి సెంటర్ల అద్దె బిల్లులను,  ఆరోగ్యలక్ష్మి,  గ్యాస్ బిల్లులను ప్రతి నెల చెల్లించాలన్నారు. రిటైర్డ్ అయినా  అంగన్వాడి ఆయా,  టీచర్ల బెనిఫిట్స్ వెంటనే మంజూరి చేయాలని కోరారు.ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం అంగన్వాడి టీచర్లకు 18వేలు,  ఆయాలకు 12 వేల వేతనాలను వెంటనే ఇవ్వాలన్నారు.అంగన్వాడి సెంటర్లకు అందించాల్సిన ఆట వస్తువులు, ఫర్నిచర్ ను అందించి,జిల్లాలో ఖాళీగా ఉన్న ‘ఆయా’ పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో అసోసియేషన్ ట్రేజరి  కొండీకొప్పుల పద్మ,ఉపాధ్యక్షురాలు ఓరుగంటి శ్యామల, చొప్పరి అంజలి, పద్మ,సైదాషఫీ, సరోజన, పద్మ, సుధారాణి, మంజుల, భాగ్య, సునీత, వాణి, లక్ష్మి, మంజుల, వాణి, జ్యోతి, వజ్రమ్మ, జ్యోతిలు తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

August 2024
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading