* జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి.
నేటి భారతం'( ప్రశ్నించడమే పరిష్కారం).
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
వ్యక్తిలో పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని, కృషితో నాస్తి దుర్భిక్షం అని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అంజిరెడ్డి పేర్కొన్నారు. గురువారం వెంకట రామా రెడ్డి జయంతి సందర్భంగా, సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ! రాజ బహుదూర్ వెంకటరామ రెడ్డి నిరుపేద రెడ్డిలకు ముఖ్యంగా అన్ని వర్గాల వారికి ఇతోదికంగా సేవ చేశారని, విద్యాసంస్థలను నెలకొల్పడంతో పాటు, వసతి గృహాలను సైతం ఏర్పాటుచేసి, తన ఆస్తులను కూడా త్యాగం చేసిన మహానుభావుడని కొనియాడారు.నిజాం కాలంలో కోత్వాల్ (పోలీస్ కమిషనర్)గా ఎనలేని సేవలందించారని,వెంకటరామ రెడ్డి ఆశయాల కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.అనంతరo రెడ్డి సంఘము ప్రాంగణంలోని వివిధ నిర్మాణాలు,ఆర్థిక లావాదేవీల గురించి తెలియజేస్తూ భవిష్యత్తు కార్యాచరణలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ విద్యార్థులకు సన్మానాలు, గత వార్షిక పరీక్షలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన రెడ్డి విద్యార్థులకు నగదు పారితోషకాలు అందిస్తూ పిల్లల తల్లిదండ్రులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దూరు రాంరెడ్డి, మాజీ అధ్యక్షులు కోర్ కమిటీ సభ్యులు పూర్మాణి రామలింగారెడ్డి, పాతూరి మహేందర్ రెడ్డి, బాణాపురం రంగారెడ్డి, పొన్నాల బాల్ రెడ్డి, జిల్లా కమిటీ కార్యవర్గ సభ్యులు వివిధ మండలాల అధ్యక్షులు, గ్రామాల అధ్యక్షులు, కుల బంధవులు పాల్గొన్నారు.











Leave a Reply