

• పోక్సో యాక్ట్ ,గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన.
• లైంగిక దాడులు అరికట్టడంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
• రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
‘నేటి భారతం’ ( ప్రశ్నించడమే పరిష్కారం)
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
‘పోక్సో చట్టం’ లో విద్యార్థినుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేట జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోక్సో చట్టం’ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ విద్యార్థినిలకు “గుడ్ టచ్ బ్యాడ్ టచ్’ ల పై అవగాహన కల్పించారు. లైంగిక దాడులు అరికట్టడంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
చిన్నారులు తమకు ఇంట్లో,పాఠశాలలో,విధుల్లో పొరుగువారితో ఎదురయ్యే రకరకాల వేధింపులు, అసభ్య ప్రవర్తన,గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ల గురించి నిర్భయంగా తమ తల్లిదండ్రులకు తెలియజేయాలని,తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు.మహిళలను గౌరవించడం, వారికి అండగా నిలబడడం వంటివి అలవర్చుకోవాలని తెలిపారు.మైనర్ బాలికలు, చిన్నారుల పట్ల నేరాలకు పాల్పడే వారికి పోక్సో చట్టం ప్రకారం జీవిత ఖైదు వంటి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని,తద్వారా తమ విలువైన జీవితం అంతా జైల్లోనే మగ్గిపోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.విద్యార్థినిలు,మహిళలు మౌనం విడి ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని,నిర్భయంగా ముందుకు వచ్చి వారి సమస్యలను తెలిపినప్పుడే మరింత భద్రత కల్పించగలువుతామని,మహిళలు,విద్యార్థినిలు జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు ఫోన్ ద్వారా పిర్యాదు చేయవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సిరిసిల్ల టౌన్ సి.ఐ కృష్ణ,జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజాం,సిడబ్ల్యుసి చైర్పర్సన్ అంజయ్య,షీ టీం ఏ. ఏ. ఎస్.ఐ ప్రమీల, షీ టీం సిబ్బంది రమాదేవి, ప్రియాంక,మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా ఐసిపిఎస్ సిబ్బంది సఖి సిబ్బంది,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.











Leave a Reply