కౌన్సిలింగ్  కు కన్విన్స్ అయ్యేరా?

Published by

on

* కౌన్సిలింగ్  కు కన్విన్స్ అయ్యేరా?

* యువకుల పంతా మారేనా…?

* ఈసారైనా వినాయక నవరాత్రి ఉత్సవాలు పద్ధతిగా జరిగే నా…?

నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

 

సిరిసిల్ల పట్టణంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి, వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే వారికీ,రేపు (మంగళవారం )సిరిసిల్ల పట్టణంలో ని కళ్యాణ లక్ష్మి గార్డెన్ లో, సిరిసిల్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉ :10:00గం ల కు సమావేశం ఉందని ప్రతి మండపం నుండి ఐదుగురు చొప్పున నిర్వాహకులు రావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు. ప్రకటన వెలువడిన కొద్దిసేపట్లోనే ఈ అంశంపై  పట్టణం లో తీవ్ర చర్చ జరుగుతున్నది. వినాయక నవరాత్రి ఉత్సవాలకు ముందు ప్రతిసారి పోలీసులు విధిగా పిలవడం, నిర్వాహకులు వెళ్లడం జరుగుతుంది తప్ప నిర్వాహకుల్లో  ఎలాంటి మార్పు జరగదని పలువురు అంటుండగా, ఎప్పటిలాగే నిమజ్జనం రోజు తర్వాత మరో రెండు రోజులు ఊరేగింపులు చేసి,తాము ఫలానా తాలూకా అని గొప్పగా చూపుకోవడానికే ఈ ఉత్సవాలు అని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.దేవుని  పేరు చెప్పి డీజే లతో డిస్కో డాన్సులు చేయడానికి ఈ పండగలను పలువురు వారికి అనుకూలంగా మలుచుకుంటున్నారని ఇంకొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ సమావేశం తోనైనా, ఈ ఎస్పీ  ఆధ్వర్యంలోనైనా ఈసారి వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తి, శ్రద్ధలతో శ్రాస్తోక్తంగా నిర్వహణ జరుగుతుందా??? యువకులు ఎప్పటిలాగే మేము ఫలానా తాలూకా అని నిరూపించుకోవడానికే చూస్తారా వేచి చూడాలి.

Leave a Reply

  1. నవరాత్రి సామూహిక ఉత్సవాలు అందరినీ ఏకం చేయడానికి మొదలుపెట్టారు, కానీ ఇప్పుడు వాడకట్టుకి 4గ్రూప్ లు తయారు అయినాయి, తాగి తందానాలు చండాలం అయింది, పెద్దలు పిల్లలకి చెప్పాలి ఇది సరైనది కాదు అని

    1. Thank you sir, మీ స్పందనకి

August 2024
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading