కోర్ట్ ఆర్డర్ వస్తే తప్ప కూల్చలేదు……?

Published by

on

• వరుస కథనాలు రాసిన స్పందించని నాటి సిరిసిల్ల మున్సిపల్ అధికారులు.

• నేడు కోర్టు ఆర్డర్ తో  సెల్లార్లను కూల్చిన మునిసిపల్ అధికారులు.

• “నాడు” అధికారం అండతో అక్రమ నిర్మాణం అడ్డుకున్న భవన యజమాని అంటూ పట్టణంలో “చర్చ’

• నామమాత్రపు చర్యలేనంటున్నా పిర్యాదుదారుడు.

నేటి భారతం'( ప్రశ్నించడమే పరిష్కారం)

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

రోజు రోజు  కు అధికారుల తీరు మారిపోతుంది. పేదవారికి ఒకరకంగా, బడా బాబులకు మరోరకంగా సేవలందిస్తున్నారు. అక్రమ నిర్మాణమంటూ పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకునే అధికారి కనిపించడం లేదు నేటి సమాజంలో .అధికార పార్టీ నాయకులకో, పార్టీ కార్యకర్తలకో తలోగ్గి అధికారులు పనిచేస్తుండటం ఆనవాయితీగా మారుతుంది.  చట్టాలపై అవగాహన ఉండి, పది రూపాయలు ఖర్చుపెట్టి కోర్టు మెట్లు ఎక్కిన ఫిర్యాదు దారులకు మాత్రమే అధికారులు న్యాయం చేస్తున్నారు. లేదంటే పలుసమస్యల పై వేల ఫిర్యాదులు ఇచ్చిన,  సంవత్సరాలు గడిచిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది తప్ప చర్యలు శూన్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని hdfc bank ఉన్న భవనం సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ ది.భవనిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లకు షట్టర్లు బిగించి, వారి అవసరాలకు వాడుకుంటుండగా,  పట్టణానికి చెందిన బిజెపి నాయకులు నాగుల శ్రీనివాస్ ఆ భవనంపై పలమార్లు ఫిర్యాదు చేసిన, నాటి సిరిసిల్ల మున్సిపల్ అధికారులు సరైన విధంగా స్పందించకపోగా,శ్రీనివాస్ కోర్టు మెట్లు ఎక్కడంతో,స్పందించిన కోర్టు, వెంటనే భవన నిర్మాణ నిబంధనలను అమలు జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేయడంతో గురువారం మంచే శ్రీనివాస్ కు సంబంధించిన  అక్రమ నిర్మాణమైన సెల్లార్లను jcb సాయంతో కూల్చేశారు. ఇదిలా ఉండగా, మున్సిపల్ అధికారులు చేపట్టిన చర్యలు నామాత్రంగానే ఉన్నాయని, ఫిర్యాదారుడు నాగుల శ్రీనివాస్ అసహన వ్యక్తం చేశారు.

Leave a Reply

September 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading