• వినతులు పట్టించుకోని డీఈఓ.
• గత డీఈఓ కు విన్నవించిన చర్యలు శూన్యం.
• ఇకనైనా ప్రైవేట్ పాఠశాలకు ఆదేశాలు జారి చేస్తారా..? యాజమాన్యాలకు తలోగ్గుతారా…?
‘నేటిభారతం“
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ప్రవేట్ పాఠశాలలో ఫీజు వివరాల నోటీస్ బోర్డు తెలియజేయాలని
బిఆర్ఎస్ (BRS )విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేసారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం వారికీ నచ్చిన రీతినా ఫీజులు వసూల్ చేస్తున్నారని,వారందరు వారి పాఠశాలల ఫీజు వివరాలు పాఠశాల ఆవరణలో బోర్డ్ పై ఉంచాలని మంగళ వారం జిల్లా విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు.అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో నోటీస్ బోర్డులో ఫీజు వివరాలు తెలియజేయాలని అన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టా రీతిలో, అన్యాయంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థల పై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేసారు.
పలు ప్రైవేట్ పాఠశాలలో ఇష్టా రీతినా డైరీ, యూనిఫామ్, నోట్ బుక్స్ పేరిట వారిదైనా శైలిలో దోపిడీకి పాల్పడుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని డీఈఓ ఇలాంటి విషయాల పై దృష్టి సారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు కోడం వెంకటేష్. శ్రీనివాస్. కొలనూరు కరుణాకర్. సంపత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply