పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Published by

on

• పలు ఫైల్ ల పరిశీలించిన ఎస్పీ.

• డయల్ 100 కాల్ రాగానే వెంటనే, సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలన్న ఎస్పీ.

• రాత్రి 10 గంటల వరకు మాత్రమే చిన్న స్పీకర్లను వినియోగించుకోవలన్న ఎస్పీ.

•   ప్రతి రోజు  మండపాలను  పరిశీలించాలన్న ఎస్పీ .

• శోభాయాత్ర లో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని వివరించి చెప్పాలని ఆదేశించిన ఎస్పీ.

నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం ):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్బంగా స్టేషన్ లో ని పలు ఫైల్స్, రికార్డ్స్ తనిఖీ చేసి, నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని,ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు.డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో గణేశ్ ఉత్సవాలు ప్రజలు శాంతియుతంగా జరిగేలా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని,గణేష్ మండపాలను అధికారులు, సిబ్బంది తరచు సందర్శిచాలని,మండపాల నిర్వహకులకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే చిన్న స్పీకర్లను వినియోగించుకోవలని,శోభాయాత్ర సమయంలో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని వివరించి చెప్పాలని ఆదేశించారు.ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ కృష్ణ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

September 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading