నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం ):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
సిరిసిల్ల అంబేద్కర్ నగర్ అంటేనే పాలకులకు, అధికారులకు అలుసు. సిరిసిల్ల సెస్ పరిధిలో ని అంబేద్కర్ నగర్ లో 35ఏళ్ల క్రితం వేసిన విద్యుత్ స్థంబాలు ఒక్కొక్కటిగా విరిగిపోతున్నాయి. గతంలో పాత విద్యుత్ స్థంబాలు తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తామన్నా సెస్ పాలకవర్గం, కేవలం మెయిన్ రోడ్డు పక్కన ఉన్న స్థంబాలు మార్చి, చేతులు దులుపుకున్నారే తప్ప పని పక్కాగా నిర్వహించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇకనైనా పాత విద్యుత్ స్థంబాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.











Leave a Reply