నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ని రైసింగ్ అకాడమీ విద్యార్థి ఎంపికైనట్లు రైసింగ్ ఫిట్నెస్ & స్పోర్ట్స్ అకాడమీ హ్యాండ్ బాల్ కోచ్ కృష్ణ హరి (NIS) తెలిపారు. ఈ నెల 6న జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలు రామడుగు మండల కేంద్రం లో నిర్వహించగా, పోటీలో సిరిసిల్ల జిల్లా జట్టు నుండి ప్రతిభ కనబరిచిన జిందం వర్షిత్ ( 8వ తరగతి ఇంగ్లీష్ యూనియన్ స్కూల్ )ఈ నెల 14,15 తేదీలలో హన్మకొండ J N S స్టేడియం లో జరిగే రాష్ట్ర స్థాయి లో పాల్గొంటారని కోచ్ కృష్ణ హరి తెలిపారు. ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండే క్రీడాలను అలవార్చుకోవాలని, విద్యార్థి ఏదైనా క్రీడాలో పాల్గొని తమలో వున్నా క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శన చేయాలని పేర్కొన్నారు, రాష్ట్ర స్థాయి కి ఎంపికైన క్రీడాకారుడిని కరెస్పాండంట్ రాజు కుమార్,అకాడమీ ఫిట్నెస్ కోచ్ ప్రేమ్ కుమార్, క్రికెట్ కోచ్ సాయి తేజ, PET రాజశేఖర్ లు అభినదించారు.











Leave a Reply