

‘నేటి భారతం’ (ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Sep 23, 2024.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ను నియంత్రించడానికి ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఎవరు వేస్తున్నారు…. ఎందుకు తీస్తున్నారో అర్థం కావడం లేదు. రాష్ట్రము లోని ఏ జిల్లా వారైనా సిరిసిల్ల లో డ్రైవింగ్ చేయాలంటే బేంబేలెత్తి పోతున్నారు. అలాంటి పరిస్థితిని తొలగించడానికి సిరిసిల్ల పాత బస్టాప్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసారు సదరు డిపార్ట్మెంట్ అధికారులు.ప్రజలందరూ ట్రాఫిక్ సిగ్నల్స్ కు అలవాటు పడుతున్న ప్రతిసారి ఎవరో మహానుభావులు ఎండ మండుతుందని , వర్షంపడుతుందని సిగ్నల్స్ తీసేస్తున్నారు.అసలే అడ్డ దిడ్డంగా వాహనాలు నడిపే సిరిసిల్ల ప్రజానీకానికి, మాటిమాటికి ట్రాఫిక్ సిగ్నల్స్ తీసేయడం వల్ల,ఉదయం పూట స్కూళ్ల కు, ఉద్యోగాలకు,పనులకు వెళ్లే సామాన్య జనo తీవ్రయిబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు మరి కొందరైతే ఓ పద్ధతి నడుస్తుంది, నడిసేది నడ్వనియ్యక మాటి మాటి కి ఈ లైట్స్ తీసుడే దయ్యా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.దయచేసి నడిచే లైట్లను నడ్వనియ్యాలని ప్రజలు కోరుతున్నారు.











Leave a Reply