Ibhomma రవి’ ఎమ్మెల్యే గా పోటీచేస్తే గెలుస్తాడు.

Published by

on

సోషల్ మీడియాలో ibhomma రవి పై ప్రజల చర్చ.

నవంబర్ 18/25 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

* I bomma  రవి ఎమ్మెల్యే గా పోటీచేస్తే గెలుస్తాడు,

* ” సినిమా టికెట్ల ధరలు పెంచితే ఎవరు పట్టించుకుంటాలేరు గాని,సామాన్య ప్రజలకు ఎంతో సపోర్ట్ చేసిన రవిని పట్టుకున్నారు.

*” ఠాగుర్ సినిమాలో #చిరంజీవి క్యారెక్టర్ తప్పైతే.

ఐ బొమ్మ #ఇమ్ముడి_రవి చేసింది కూడా తప్పవుతుంది.

* గాడిద మొహాలకు రంగులు అద్దుకోని తమకు తాము #హీరో అనుకునే గాడిద కొడుకులు #వందలకొట్లూ పారితోషికాలు తీసుకుంటూ ప్రేక్షకులను పీల్చి పిప్పి చేస్తుంటే #ఒక్కడు వచ్చాడూ ఇది అన్యాయం అని చెప్పాల్సి వస్తే అది తప్పా? ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో మర్మోగుతున్న చర్చ.

అవును! సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలను ఊటంకిస్తూ “నేటిభారతం”అభిప్రాయం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ ఆడ కూతురు తన మేనకోడలు సారి ఫంక్షన్ లో  తన 3తులాల గోల్డ్ చైన్,1తులం రింగ్స్ పోయాయని ఓ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే, ఏవండీ అది మీ దగ్గరి వారు అయ్యి ఉండొచ్చు, ఎంతమందినని అడుగుతాం చెప్పండి. సర్లే మేం చూస్తాం, మీరు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి అన్నాడు అ SI.ఓ సామాన్య కుటుంబానికి సాయం చేయడానికి డ్యూటీ గుర్తు రాలేదు కానీ,సినిమా హీరోలు, నిర్మాతలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, దిల్ రాజు లాంటి వారు ibhomma వల్ల సినిమా పరిశ్రమ దెబ్బ తింటుంది అని మన తెలంగాణ పోలీస్ లకు పిర్యాదు చేయగానే ఊటహుటిన చర్యలు చేపట్టి ibhomma రవి ని పట్టుకున్నారు.ఇక్కడ పేదవాని 3తులాల చైన్, 1తులం రింగ్ కంటే, బడ హీరోల సమస్య చాలా పెద్దదిగా భావించరన్నమాట…? పోలీస్ కి పేదవాని పిర్యాదైనా, బడ బాబుల పిర్యాదైనా ఒకటేగా…? మరి పేదవాడి గోల్డ్ ఎందుకు దొరకబట్టలేదు…? ఈ ibhomma రవిని ఎందుకు అంత త్వరగా పట్టుకున్నారు…?ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ హై కోర్ట్ ఆల్రెడీ ఓజీ సినిమా టికెట్ ధరల పెంపు పిటిషన్ లో DVV దానయ్యకు మొట్టికాయలు వేస్తూ, ‘ప్రజలు మిమ్మల్ని అడిగారా భారీ బడ్జెట్ సినిమా తీయమని అని ప్రశ్నించింది”. హైకోర్ట్ ఆదేశాలు పక్కన పెట్టి లాభాలు గడించింది నిర్మాతలు కదా…?

ఎవరికీ లాభం…..?

మరి ఈ పైరసిని అరికడితే ఎవరికీ లాభం.? కొత్త సినిమా వచ్చినప్పుడల్లా సినిమా చూద్దామని  వెళ్ళితే,  పెంచుతున్న టికెట్ ధరలతో జేబులు ఖాళీ చేసుకుంటున్న ప్రజలకా…?ఒక సినిమా తీస్తే 18కోట్లు, 20కోట్లు తీసుకొనే హీరోలకా.?హిటైనా, ఫటైనా కోట్లు తీసుకొనే డైరెక్టర్ల కా..? కోట్లు లాభం గడించే నిర్మాతలకా…? రోజుకు 500/-, 1000/- తీసుకుంటూ సినిమా హిట్ లో భాగమైన సినిమా రంగ కార్మికులకా…? సినిమా రంగ కార్మికులకైతే వారికి ఇస్తున్న వేతనాలను ఎప్పుడైనా నిర్మాతలు బహిర్గతం చేసారా…?చేస్తే ప్రజలకు చూపాల్సిన బాధ్యత, అవసరం లేదా…? ఇలా సినిమా ద్వారా  మంచిని సమాజానికి చూపకుండా, లాభర్జనే ద్యేయంగా సినిమా లు తీస్తూ, యూవతను ఆగం చేస్తున్న  బడ హీరో, నిర్మాత, డైరెక్టర్ లకు చెంపపెట్టు సమాధానమే ibhomma అని ఎందుకు అనుకోకూడదో దిల్ రాజు, నాగార్జున చెప్పాలి. 

నిర్మాతల తీరు మారాలి…!

ఈ దేశంలో  హోదా, డబ్బు, పలుకుబడి రాజ్యమేలుతుందని ibhomma రవి అరెస్ట్ తో  స్పష్టమైంది. సామాన్య జనం జేబులు ఖాళీ చేసుకుంటేనే సినిమా రంగం పై లాభాలు గడించి, పేరు పొందిన వారంతా హోదా, పలుకుబడి, డబ్బుతో ఉన్నారని మరవద్దు.నిజంగా దిల్ రాజు, చిరంజీవి, నాగార్జున,వెంకటేష్, మహేష్ బాబు,ప్రభాస్,జూ. ఎన్టీఆర్  వేదికలపై  మీరే మా దేవుళ్ళు అని ప్రేక్షకులపై దొంగ ప్రేమ చూపొద్దు..! మీకు ప్రేక్షకులే దేవుళ్ళైతే  మీ సినిమా లకు  టికెట్ ధరలు సామాన్యునికి అందుబాటులో ఉండేలా చుడండి. గతంలో అందరు నిర్మాతలు 100రోజుల హిట్ కొట్టారు, ఇప్పుడున్న నిర్మాతలు ఎందుకు అ చరిత్రను చేరిపేస్తున్నారు..? మీ సినిమా లో కథ, దమ్ముంటే ఉంటే జనమే ఎగబడుతారు కదా…?ఇకనైనా మీ తీరు మార్చుకోండి నిర్మాతలరా.

Leave a Reply

November 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading