సమ్మెలోకి అసిస్టెంట్ హెల్పర్లు…!

Published by

on

నవంబర్ 23/25 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

సెస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న   అసిస్టెంట్ హెల్పర్లు సమ్మె చేయనున్నట్లు తెలుస్తోంది. విధునిర్వహణలో భద్రత, వేతనాల పెంపు, ప్రమోషన్ ల  కొరకు సమ్మె చేయనున్నట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెస్ పరిధిలో 147 మంది హెల్పర్లు ఉన్నారు. వీరిలో విధి నిర్వహణలో 3మరణించారు. 3 వైఖల్యం పొందారు.2018 లో ప్రమోషన్ డిక్లరే అయ్యిన వీరికి, 2020 లో JLM పోస్ట్ లు ఇవ్వాలి, కాని నేటికీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం వీరు  18వేల వేతనం మాత్రమే పొందుతున్నారు.ఆఫీస్ లో ఉన్న వారికి అత్యధిక వేతనాలు అందిస్తూ, నిరంతరం ఫీల్డ్ వర్క్ చేసే వీరికి సెస్ అధికారులు 18వేలు మాత్రమే ఇవ్వడం విమర్శలకు తావిస్తుంది. NPDCL నిబంధనలు పరిగణలోకి తీసుకుంటే కనీస వేతనం 30వేలు ఇవ్వాల్సి ఉంది.వీరిని, వీరి విధులతో పాటు అదనంగా చెట్లు నరకడం, బకాయి వసూళ్లు చేయడం లాంటి పనులను సంస్థ చేయిస్తుంది. ఈ నేపథ్యంలో హెల్పర్లు సమ్మె చేస్తే సంస్థ పాలకవర్గం సానుకూలంగా స్పందిస్తుందా..? హెల్పర్లకు న్యాయం జరుగుతుందా..? చూడాలి మరి.

Leave a Reply

November 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading