



• సామాన్యులకే చట్టాలు….భడ బాబులకు అవి చుట్టాలు.
• సిరిసిల్లాలో అధికారులందరు బిఆర్ ఏస్ తొత్తులు గా వ్యవహరిస్తున్నారని ఆరోపణ.
•ప్రజలకు సేవ చెస్తే,ప్రజాధారణే ఉంటే ఇంత ఆర్భాటమెందుకని ప్రశ్న.
•ప్రజాక్షేత్రంలో ఇద్దరం అభ్యర్థులమే అయితే…అధికారులు ఎందుకు వ్యత్యాసం చూపుతున్నారని అధికారులను ప్రశ్నిస్తున్న పత్తిపాక సురేష్ .
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం)
ఎన్నికల వేళ ప్రజా క్షేత్రంలో అభ్యర్థులందరు సమానమేనని,కాని కొంతమంది అధికారులు బిఆర్ ఎస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజా స్వామ్యానికి మంచిది కాదని సిరిసిల్లా నియోజకవర్గ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పత్తిపాక సురేష్ అన్నారు. మంగళవారం! ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరించడం లేదని,తమను మాత్రమే అధికారులు తప్పుబడుతూ,ఇబ్బందులకు గురిచేయడాన్ని తప్పుపడుతూ, పత్తిపాక సురేష్, కేటిఆర్ రోడ్డు షో సభ స్థలికి రావడంతో ఒక్కసారిగా సభ ప్రాంగణం వేడెక్కింది.పోలిస్ లు పత్తిపాక సురేష్, వారి అనుచరులను పంపించి వేశారు.అదే సమయంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ సైతం నిరసన తెల్పడంతో ఎం జరుగనుందో అర్థం కాని పరిస్థితి ఎర్పడింది. పోలిస్ లు వచ్చి వారించినా,వినకపోవడంతో బిజెపి నాయకులను ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా పత్తిపాక సురేష్ మాట్లాడుతూ,తాను ఎన్నికల ప్రచారానికై ఫ్లెక్సీ ల అనుమతి పొందానని, అ అనుమతులు ఈ నెల 25 తో ముగియడంతో ,మున్సిపల్ అధికారులు తొలగించారని తెలిపారు.అదే కేటిఆర్ కైతే అనుమతులు ఉన్న, అవి 10 ఫ్లేక్షీ లకే పరిమితమైతే, ఇలా ఊరంతా ఏలా ప్రదర్శిస్తారని,ప్రశ్నించారు. సిరిసిల్లా మున్సిపల్ కమీషనరైతే పూర్తిగా బిఆర్ ఎస్ పార్టికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేటిఆర్ రోడ్ షో కు ఇచ్చిన అనుమతుల పై పోలిస్ అధికారులను నిలదీస్తే, మీకేమైన అభ్యంతరముంటే పిర్యాదు చేస్తే,చట్టం తన పని తాను చూసుకుంటుందని తెల్పడం హాస్యస్పదంగా ఉందన్నారు. అదే ఓ సామాన్యుని సమావేశానికి, అనుమతులలో ఎదైన చిన్న తేడా ఉంటే వెంటనే రసభాస చేసే పోలిస్ యంత్రాంగం ,కేటిఆర్ రోడ్ షో విషయంలో ఎందుకు చట్టాన్ని అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.తాను ఈ ఎన్నికల్లో అభ్యర్థినేనని, చట్టం అందరికి సమానమేనని, కాని సిరిసిల్లాలో పలువురు అధికారులు బిఆర్ ఏస్ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈతతంగమంత ప్రజలు గమనిస్తున్నారని ,ప్రజలే తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు.











Leave a Reply