
• బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్.
• దళితులకు మూడు ఎకరాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే.
• కాంగ్రెస్ తోనే దళితుల అభివృద్ధి.
• వార్డ్ సందర్శనలో కేకే మహేందర్ రెడ్డి.
నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ తోనే అమలని,కాంగ్రెస్ తోనే దళితుల అభివృద్ధని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు.శనివారం ఏన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లా పట్టణంలోని అంబేడ్కర్ నగర్ లో కె.కె మహేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ,గత బిఆర్ ఏస్ ప్రభుత్వం అభివృద్ది పేరు చెప్పి, ఇందిరమ్మ !దళితులకిచ్చిన భూములను లాక్కున్నారని విమర్శించారు. కాంగ్రేస్ అంటేనే ప్రజల పార్టని, కాంగ్రేస్ పాలనలోనే దళితుల అభివృద్ది జరుగుతుందని పేర్కొన్నారు.కాంగ్రేస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటిలు తప్ప నెరవేరుస్తామని తెలిపారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆకునూరి విజయ నిర్మల, నాగుల సత్యనారాయణ, ఆకునూరి బాలరాజు,కత్తెర దేవదాస్ ,గడ్డం నర్సయ్య,తిరుపతి రెడ్డి, కాముని వనిత,నళినికాంత్ ,రెడ్యానాయక్ ,తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply