• దళితులకు అండగ నిలిచేది కాంగ్రేస్ పార్టి మాత్రమే.
• 10 సం”రాల బిజెపి పాలనలో దళితుల పై అనేక దాడులు జరిగాయి.
• రానున్న ఎన్నికల్లో కాంగ్రేస్ కే పట్టం కట్టాలి.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
బిజెపి పాలనలోనే దళితుల పై అనేక అరచకాలు,ఆకృత్యాలు జరిగాయని అంబేడ్కర్ సంఘూల రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్ అన్నారు.శనివారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దేవదాస్ మాట్లాడుతూ, ఈ 10 సం”రాల బిజెపి పాలనలో దేశంలో అనేక మారణ హోమాలు, అరచకాలు,ఆకృత్యాలు జరిగాయన్నారు.గుర్రం పై ఓ దళిత యువకుడు వెళ్ళాడని, అగ్రవర్ణాల వారు అతని దాడులు చేశారన్నారు. మణిపూర్ లో మానవీయ ఘటన జరిగిన నేటికి బిజెపి ప్రభుత్వం స్పందించలేదన్నారు.రాబోయే ఎన్నికల్లో దేశంలో బిజెపి గెలిస్తే రాజ్యాంగం మార్చే ప్రమాదముందని పేర్కొన్నారు.
జిల్లాలోని యువకులకు ఆలోచించాలని,లేనిపక్షంలో ప్రమాదం పోంచి ఉందని తెలిపారు.బిజెపికి 400 సీట్లు వస్తే హిందుత్వం వస్తుందని అంటున్నారని,అంతకు ముందు మన దేశంలో హిందుత్వం లేదా? అని ప్రశ్నించారు. బిఆర్ ఎస్ కూడ వారు చేసిన అభివృద్ది గురించి చెప్పకుండా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామిలు గురించి మాట్లాడటం హాస్యస్పదమన్నారు. నిన్నటి రోజు మాజీ, సి.ఎం స్థాయి మరచి మాట్లాడటం భాదకరమన్నారు. జిల్లా ఉద్యమంలో ,ఉద్యమ కారుల పై కేసులు పెట్టింది వారు కాదా? అని ప్రశ్నించారు.సిరిసిల్లా బిఆర్ ఎస్ నాయకులు, అభివృద్ది గురించి మాట్లాడుతున్నారని, సిరిసిల్లాలో ఎ పాటి అభివృద్ది జరిగిందో చూడాలంటే వర్షకాలంలో సిరిసిల్లా పాత బస్టాండా చూస్తే అర్థమౌతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్ప దళితులకు మనుగడలేదని ,అందుకే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో
అంబేడ్కర్ సంఘం జిల్లా నాయకులు ,తుంగ శివరాజ్ , కొట్టెపెల్లి సుధాకర్ ,నేదూరి లక్ష్మణ్ ,ఆకునూరి బాలకిషన్ ,గొల్లపల్లి పర్శరాములు,గడ్డం కిరణ్ ,సురేష్ ,తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply