• కుక్కలకు కూ. ని చేయడానికి నిధులు వెచ్చించిన ఫలితం శూన్యం.
• కుక్కల కూ. ని కి కేటాయించిన నిధుల స్వాహా వల్లే సిరిసిల్ల పట్టణంలో వరుసగా కుక్కల దాడులు.
• సానుభూతి ప్రకటిస్తూ చేతులు దులుపుకుంటున్న పురపాలక సంఘం చైర్ పర్సన్, కమిషనర్లు.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
కమిషన్ల కక్కుర్తి వల్లే… కుక్కల దాడులు జరుతున్నాయని సిరిసిల్లా పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.పట్టణంలోని 34 వవార్డ్ లో వరుసగా కుక్కల దాడులు జరుగుతూ ఉన్నాయి.గురువారం 34 వవార్డ్ కు చెందిన
నర్సింగోజ్ వెంకటేశం, మమత ల కుమారుడు నర్సింగోజ్ లిమ్స్(03)పై,అదే వార్డ్ కు చెందిన చౌడవరం రాజు, సుమలత ల అమ్మాయి చౌడరపు ఆద్య పై కుక్కలు దాడి చేశాయి. ఇంత మంది కుక్కల దాడుల్లో గాయాల పాలౌతున్న సిరిసిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ ,కమీషనర్లు వారిని పరామర్శించి చేతులు దులుపుకుంటున్నారే తప్ప!శాశ్వత పరిష్కార మార్గం చూపకపోవడం సోచనీయం.ఇదిలా ఉండగా గత సం”రం జూన్ మాసంలో సిరిసిల్లా మున్సిపల్ సంస్థ కుక్కలకు కుటుంబ నియంత్రణ (కు.ని) చేయించడానికి నిధులు వెచ్చించిన! కుక్కల ప్రత్యుత్పత్తి ఆగలేదు,పైగా అదే సం”రం కుక్కలు పదుల సంఖ్యలో కుక్కలకు జన్మనిచ్చాయంటే, కుక్కల కు.ని కి కేటాయించిన నిధులను మున్సిపల్ సంస్థ అధికారులు స్వాహ చేశారనేది స్పష్టమౌతుంది. నిధులు స్వాహ చేయకుండా చిత్తశుద్దితో ప్రజాధనాన్ని ప్రజా ప్రయోజనాల కొరకు వినియోగిస్తే ఫలితం తప్పకుండా ఉండేదని ప్రజబు అగ్రహం వ్యక్తం చెస్తున్నారు. ఇలా కుక్కలు మరో మారు దాడులకు పాల్పడకుండా మున్సిపల్ చైర్ పర్సన్ తక్షణ చర్యలు చేపడతారా? ఎప్పటిలాగే సానుభూతి తెలుపుతూ చేతుబు దులుపుకుంటారా వేచి చూడాలి.











Leave a Reply