• టి పి టి ఎఫ్ జిల్లా భాద్యులు దోర్నాల భూపాల్ రెడ్డి,దుమాల రమానాథ్ రెడ్డి.
నేటిభారతం(ప్రశ్నించడమేపరిష్కారం):
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
ఉపాధ్యాయుల పై లాఠీ చార్జి చేయించిన నారాయణ ఖేడ్ ఎన్నికల అధికారి పై చర్యలు తీసుకోవాలని టిపిటీఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా బాధ్యులు దోర్నాల భూపాల్ రెడ్డి,దుమాల రమానాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణ ఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్ లో ఎన్నికల విధులు నిర్వ హించిన ఉపాద్యాయుల పై ఎన్నికల అధికారి చర్యలను నిరసిస్తూ, ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో వారు మాట్లాడుతూ,రాజన్న సిరిసిల్ల జిల్లా లో అధికారులు సరియగు సమన్వయం తో ఎన్నికలు పూర్తి చేసి ఉద్యోగుల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. కానీ నారాయణ ఖెడ్ అసెంబ్లీ పరిధిలో మాత్రం న్యాయంగా తమకు రావాల్సిన వేతన భత్యాలను ఇవ్వాలని అడిగిన వారిపై పోలీసు బలగాల తో బల ప్రయోగాలు చేయించడం అత్యంత దారుణ మన్నారు. ఎన్నికల శిక్షణ లో ఉపాధ్యాయులు, విధుల పట్ల ఎంతో అంకిత భావం తో పనిచేస్తారని పొగిడిన అధికారులే,పనులు ముగించు కున్నాక దాడులు చేయించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు .
ఈ ఘాటనను ఖండిస్తూ,గొడవ కు కారణమైన అధికారుల పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నిక సంఘాన్ని డిమాండ్ చేశారు.











Leave a Reply