• పేరుకే ప్రజా సేవ….. పనులన్నీ పైసలతో నే.
• డివిజన్లలో సభ్యుల(ఓటర్ల )ప్రమేయం లేకుండా అభ్యర్థులే, డబ్బులకు అమ్ముడుపోతు “యునానిమస్ “అని అంటున్న వైనం.
• గెలిచిన అభ్యర్థులకు కనీసం ‘గౌరవ వేతనం’ ఉండదు, అయినా గెలుపు కై లక్ష ల ఖర్చేందుకు….?
• నాలుగు రాళ్లు వెనకేసుకోవడం కోసమా? నాణ్యమైన రాజకీయాల కోసమా?
• నాణ్యమైన రాజకీయాల కోసమైతే “ఓటుకు నోటెందుకు…..?
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం ):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
“ఎన్నికలంటే” ఓ వార్డ్, డివిజన్, లేదా నియోజకవర్గం లో ఎన్నికలు నిర్వహిస్తే, అ వార్డ్ లో ని సమస్యల పట్ల అవగాహన ఉన్న వారుగాని, చదువుకున్న యువకులు గాని, తన వార్డ్ ని అన్ని విధాలా అభివృద్ధి పరచలానే తపన ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసి, ప్రజల మద్దతు తో గెలిచి వారి లక్ష్యాన్ని అమలు ప రుస్తుంటారని, పుస్తకాల్లో చదువుకున్నాం!గడిచిన 30ఏళ్ల రాజకీయాల్లో చూసాం. కాని ఈ మధ్య కాలంలో రాజకీయాలు,ఎన్నికలంటేనే రోత పుట్టేలా చేస్తున్నారు! కొందరు స్వార్థ రాజకీయ నాయకులు,అక్రమ సంపాదనున్న భడబాబులు. వీరి చర్యలు ఎంతలా మారుతున్నాయంటే రేపటికి ఇదే సంస్కృతి అనేలా, ప్రజలు భావించేలా ఉన్నాయి.కనీసం గౌరవ వేతనమే లేని అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పదవులకు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు లక్షల్లో డబ్బు వెదజల్లుతు రాజకీయాలంటేనే డబ్బనేలా మార్చేస్తున్నారు.
డబ్బులు దండుకొని..’యునానిమస్’…..????
ఓ డివిజన్ లో 4గురు అభ్యర్థులు ఎన్నికల భరిలో నిలిస్తే, అందులో కాస్త డబ్బు, పలుకుబడి ఉన్నవాళ్లు వారి అనుచరులతో, బంధువులతో, ముగ్గుర్ని బేరామడటానికి పంపడం. 2లక్షలు,3లక్షల కు కొనడం, వారిని ఎన్నికల బరిలో నుండి తప్పించడం, అనంతరం అ డివిజన్ ను “యునానిమస్”గా ప్రకటింపజేయడం ప్రస్తుతం సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గత 2ఏళ్ల నుండి జరుగుతున్న తంతు.అసలు ‘యునానిమస్’ అంటే ఓటర్ల ఏకాభిప్రాయమే గాని,ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల అభిప్రాయం కాదనే, విషయాన్నీ పక్కనపెట్టి కొత్త సంస్కృతికి తెర లేపుతున్నారు కొంతమంది ‘కుహనా వాదులు’.
చివరికి నిలబడేది…నిజాయితీ.. నీతి మాత్రమే.
భవిష్యత్ పై నమ్మకం తో నేటి యువత అవినీతి, అక్రమార్కుల ఆటలు కట్టేలా ఎన్నికల బరిలో దిగి! ఆశలకు, ప్రలోబాలకు లొంగకుండా నిస్వార్థం తో ప్రజల కోసం పని చేస్తూ , వారి సమస్యల పరిష్కారానికై పాటుపడితే అనతి కాలంలోనే అసాధ్యమన్న ‘నీతివంతమైన రాజకీయాలు’ సుసాధ్యామౌతాయానేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.రానున్న సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఆశలకు లొంగకుండా నీజాయితీ తో ఓటు వేసి ప్రజాస్వామ్యనికి ఊపిరి పోయాలని మీ “నేటిభారతం “ఆకాంక్షస్తుంది.











Leave a Reply