జిల్లా ప్రభుత్వ వైద్యశాల సేవలు వినియోగించుకోవాలి.

Published by

on

వైద్య పరీక్షలు చేయించుకుంటున్న రాజన్న సిరిసిల్ల జిల్లా  అదనపు ఎస్పి  డి చంద్రయ్య

నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి :

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యశాల సేవలు  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ డి. చంద్రయ్య తెలిపారు.బుధవారం, తన ఆరోగ్య సమస్యల పరిష్కారానికై వైద్యుల సలహాలను తీసుకోవడానికి, తగు పరీక్షలు చేసుకోవడానికి జిల్లా వైద్యశాలకు వచ్చారు .వైద్యుల సూచనల మేరకు జిల్లా ఆసుపత్రి లోని వైద్యపరీక్షలు చేయించుకున్నారు. సామాన్య పౌరునిల జిల్లా అదనపు ఎస్పీ జిల్లా వైద్యశాల లో నేటిభారతం జిల్లా ప్రతినిధి కి కనిపించగా,’జిల్లా పోలీస్ అదనపు బాస్ అయ్యుండి, కోరుకుంటే కార్పొరేట్ వైద్యమే అందుబాటులో ఉండే స్థాయిలో ఉండి, ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు  చేయించుకోవడమేంటని, ప్రశ్నించగా ‘తనకు హెల్త్ కార్డ్  తదితరలాంటి సౌకర్యాలు ఉన్నాయని, కాని జిల్లా వైద్యశాలలో వసతులు, వైద్యసేవలు, బాగున్నాయని,సిటీ స్కాన్, ఎక్స్రే  ఈసీజీ,బ్లడ్ బ్యాంక్, తదితర సేవలు బాగున్నాయని,  అందుకే ఇక్కడికి రావడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగ పరచుకోవాలని కోరారు. ఈయన వెంట సిరిసిల్ల టౌన్ సిఐ, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

May 2024
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading