

• 5 మంది ఉపాధ్యాయులతో నడుస్తున్న రాజీవ్ నగర్ మండల పరిషత్ ఉన్నత పాఠశాల.
• తమ పాఠశాలకు ఉపాధ్యాయులను పంపాలని విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన.
• స్పందించిన జిల్లా విద్యాధికారి, వెబ్ ఆప్షన్స్ పూర్తయిన వెంటనే పాఠశాలకు పూర్తి స్థాయి ఉపాధ్యాయుల భర్తీ.
నేటి భారతం (ప్రశ్నించమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
మా పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించండని విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డేక్కి నిరసన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో మొత్తం 326 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రస్తుతం వారందరికీ ఐదు మంది ఉపాధ్యాయులే విద్య భోజనం అందిస్తున్నారని తెలిపారు.విద్యా సంవత్సరం మొదలై నెలలు గడుస్తున్న, నేటి వరకు రాజీవ్ నగర్ పాఠశాలలో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని అందుకే తాము రోడ్డెక్కామని, వారి సమస్య పై డీఈఓ కి వినతి పత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై డీఈఓ రమేష్ వివరణ కోరగా బదిలీల ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. బదిలీల ప్రక్రియ పూర్తయిన వెంటనే, రాజీవ్ నగర్ పాఠశాలకు పూర్తిస్థాయి ఉపాధ్యాయులు వస్తారని తెలిపారు.











Leave a Reply