నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.

Published by

on

• పెన్షనర్లు, 398/- స్పెషల్ టీచర్ల జేఏసీ డిమాండ్.

 

నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం):

 రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలు మరియు 398/- రూపాయల వేతనంతో పని చేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరుతూ, తెలంగాణ పెన్షనర్ల జేఏసీ పిలుపుమేరకు, సోమవారం  రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు TGPJAC  జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం  నాయకులు వి.మధుకర్ రావు,పి.వెంకటేశ్వర్లు,ఏ.రాజేశ్వరరావు లు మాట్లాడుతూ! 398/- వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు పనిచేసిన కాలానికి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన విధంగా రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తూ, పెన్షన్ బెనిఫిట్ లు ఇవ్వాలన్నారు.బకాయి ఉన్న నాలుగు డీఏలను తక్షణమే మంజూరు చేసి  నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఉచిత నగదు రహిత వైద్యం అన్ని కార్పొరేట్ ఆస్పత్రులలో అందించాలని, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో డైరెక్టరేట్, ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాలని కోరారు.అలాగే,క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ను 10 సంవత్సరాలకు కుదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పి.రాజేశ్వరరావు, ఎస్. రాజేశ్వరరావు, సిహెచ్.జనార్దన్, ఎండి రియాజుద్దీన్, కే రమేష్, ఎస్.భూమ్ రావు,M. వెంకట రమణారెడ్డి బి.దేవరాజం, డి.సత్తయ్య, ఎస్.రాధా కిషన్, P. రామచంద్రం, T. అంజయ్య, A. హనుమంత రెడ్డి, D. రాజన్న, A. ఆనంద రెడ్డి, ఎస్.విశ్వజ్ఞాచారి, శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

July 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading