
• పోయినేడుతో పోల్చితే ఈయేడు 100% సక్సెస్ అయిన “సిరిసిల్ల పోలీస్”
• పలు మండపాల్లో పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు సైతం నిమజ్జనం రోజు ఉదయం 4 గం “వరకు వేడుకలో “సంబరాలు’ చేసుకోవడం ప్రత్యేకం.
• అతీ భారీ వినాయక విగ్రహాలతో పలు వార్డ్ లలో విద్యుత్ అంతరాయం తో ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజానీకం.
• అనుకున్నటుగా నిమజ్జనం జరగడం తో హర్షం వ్యక్తం చేసిన పట్టణ ప్రజలు.
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం )
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Sep 18, 2024.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ వినాయక చవితి, నిమజ్జనం లో ఏలాంటి అవంతరాలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలతో, మండపాలను నిర్వహించే యువత తో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్ కు యూత్ కన్విన్స్ అయ్యారు.”కన్విన్స్ అయ్యారు’ అనే కంటే ఈసారి ఏలాంటి కోతి వేషాలు వేసిన కఠినమైన చర్యలు పోలీస్ యంత్రంగం చేపట్టబోతుందనే విషయాన్ని యూత్ వెంటనే గ్రహించారు.ఫలితంగా వినాయక మండపాల వద్ద సినిమా పాటలు, అద్దరాత్రి అశ్లీల నృత్యాలు ఎక్కడ కనిపించలేదు, వినిపించలేదు.పలు మండపాల వినాయకుల వద్ద పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు సైతం నిమజ్జనం వేడుకలో ఉదయం 4 గం “వరకు “సంబరాలు’ చేసుకోవడం ప్రత్యేకంగా కనిపించింది.ఇదిలా ఉండగా అతీ భారీ వినాయక విగ్రహాలతో పలు వార్డ్ లలో విద్యుత్ అంతరాయం తో సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలగడం తో వారు “నేటి భారతం”వెబ్ ఛానెల్ దృష్టికి తీసుకొచ్చారు.నిమజ్జనం ఇంత త్వరగా, ప్రశాంతంగా జరగడంలో “సిరిసిల్ల పోలీస్”లు కనబర్చిన నిబద్దతకు సెల్యూట్ కొట్టక తప్పదు.











Leave a Reply