• రథపపౌర్ణమి రోజు లడ్డు, పులిహోర గుడి ప్రాంగణం లోనే చేశారు.
• కాంట్రాక్టర్ వేములవాడ కు చెందిన పులి మల్లేశం.
• రథ మహోత్సవం సనాతన హిందూ ధర్మం ప్రకారమే జరిగింది.
‘నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Oct 21, 2024.
సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి రథమహోత్సవంలో అన్య మతస్థులు లడ్డు తయారు చేసి అమ్ముతున్నారని కొందరు వారి రాజకీయ లబ్ది కొరకే ప్రచారం చేస్తున్నారని గుడి మాజీ ఛైర్మెన్లు చేపూరి.,ఉప్పుల విట్టల్ రెడ్డి, తీగల శేఖర్ గౌడ్ లు తీవ్రంగా ఖండించారు.సోమవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ,వెంకటేశ్వర స్వామి రథ మహోత్సవంలో లడ్డు, పులిహోరా, కొబ్బరికాయలు అమ్మకం మొత్తం దేవాదాయ చట్టం ప్రకారo టెండర్ నిర్వహించడం జరిగిందని తెలిపారు.పులిహోర, లడ్డు తయారీ వేములవాడకు చెందిన పులి మల్లేశం టెండర్ దక్కించున్నారని పేర్కొన్నారు.లడ్డు తయారీ కూడా గుడి ప్రాంగణంలోనే చేసారని, కాని టెండర్ దారు లడ్డు అమ్మకానికి ఏర్పరుచుకొన్న వ్యక్తి,భక్తుడు కొన్న లడ్డుకు చిల్లర లేనందున తన స్నేయితుని Q r కోడ్ ఉపయోగించి లావాదేవీలు జరిపాడే తప్ప అన్య మతస్థుల చర్య ఏమిలేదని, కొందరు కావాలని చేస్తున్న ప్రచారమని, గత 10ఏళ్ళు గా నారాయణుని సేవలో ఉన్నామని ఎప్పుడు ఏ చిన్న పొరపాటుకు తవివ్వలేదని భక్తులు గమనించాలని కోరారు.











Leave a Reply