
నవంబర్ 12/25 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
ప్రజావాణిలో పిర్యాదు ఇచ్చినా సంబంధిత అధికారులు పట్టించుకుంటలేరని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.మిడ్ మానేరు బ్యాక్ వాటర్, పంట పొలాలలోకి రాకుండా ఉండటం కొరకు జిల్లా అధికారులు 3కి. మీల కరకట్టను నిర్మించారు.కరకట్ట నిర్మించి, దాని నిర్వహణ మరిచారాని ప్రజలు, వాకర్స్, మత్స్యకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా కరకట్ట పై ఎపుగా పెరిగిన చెట్ల వల్ల కరకట్ట పై ప్రతి రోజు ఉదయం వాకర్స్ రాకుండా పోతున్నారు. మత్స్యకారులు సైతం చేపలు పట్టడానికి వెళుతున్న క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.జన సంచారం లేకపోవడంతో ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారికి, గంజాయి బాబులకు కరకట్ట అడ్డాగా మారిపోయింది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని సిరిసిల్ల పట్టణ ప్రజలు కోరుతున్నారు.ఈ విషయమై ఇరిగేషన్ ఈ. ఈ. జగన్ ను వివరణ కోరగా ఈ అంశం పై అధికారులకు నివేదిక పంపామని, టెండర్లు పిలిచి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.











Leave a Reply