


నవంబర్ 13/25 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
18 సం” రాల లోపు పిల్లల సంరక్షణ మనందరి బాధ్యత అని తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబెర్ మర్రిపెల్లి చందన అన్నారు.గురు వారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్షేత్ర స్థాయిలో పలు అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు.అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందుతున్న ఆహరం, గుడ్లు, పాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు.పిల్లలకు అందుతున్న ఆహారాన్ని తిని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,చిన్న పిల్లల హక్కుల కొరకు మేం, కొన్ని డిపార్ట్మెంట్ లతో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. చిన్న పిల్లలతో బిక్షాటన చేయించడం, పిల్లలను చదువులకు దూరంగా పెట్టడం , చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ అభ్యుజ్ లాంటి వాటి పై జిల్లాలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఎవరైనా చిన్న పిల్లలతో పని చేపిస్తుంటే 1098 హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో టీచర్ లు తల్లిదండ్రులు, పిల్లలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాలు ప్రజలతో కలిసి పిల్లల సంరక్షణ కృషి చేయాలనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ అంజయ్య, మెంబెర్స్ పున్నంచందర్,జూవెనల్ జస్టిస్ మెంబెర్ రమణ,Dwoలక్ష్మిరాజ్యం, ఏసీడీపీఓ సుచరిత,ICDS సూపర్ వైజర్లు, టీచర్ లు తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply