

ఫిబ్రవరి 6 /26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
మున్సిపల్ ఎన్నికల్లో వినూతన ప్రచారం జరుగుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారి వార్డ్ లోని ఓటర్ల ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కానీ సిరిసిల్ల మున్సిపల్ 2వార్డు లో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి దుమాల శ్రీకాంత్, తన వార్డు పరిధిలోని ఓ మైదానంలో సుమారు 500 మంది మహిళలను సమీకరించి వారందరినీ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నాడు. ఇదిలా ఉండగా 200/- లకు ఇంటింటికి ప్రచారం చేయిస్తూన్న వారికన్నా, అలసి సొలసి పోయేకన్న, ఒక్క దగ్గరే రెండు గంటలకు కూర్చొని అభ్యర్థుల వినతులను, అభ్యర్థనలు వింటూ ఓట్లు వేయడం బాగుందని సమావేశానికి వచ్చిన మహిళా మణులు చర్చించుకోవడం కొసమెరుపు.











Leave a Reply