ఫిబ్రవరి 6 /26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
మేడారం జాతర హుండీలలో షాకింగ్ లేఖలు లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హుండీలలో ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటూ లేఖలు లభించాయని తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మలకు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విన్నతి పత్రాలను కూడా హుండీలలో వేశారని, ఆస్తి తగాదాలు పరిష్కారం అవ్వాలని, భార్యాభర్తల పంచాయతీలు లేకుండా ఉండాలని, ఇలా రకరకాల విజ్ఞప్తులు అమ్మవారిని ఉద్దేశించి రాసిన లేఖలు మేడారం హుండీలలో కనిపిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హుండీలను లెక్కిస్తున్న సిబ్బందికి ఈ లేఖలు దర్శనమివ్వడం చర్చకు దారి తీసింది.











Leave a Reply