ఆబాది భూమిని అమ్మేయబోతున్నారు.

Published by

on

ఫిబ్రవరి 19/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

ఆబాది భూమిని అమ్మేయబోతున్నారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావు పేట మండలం,భీముని మల్లారెడ్డి పేట గ్రామస్థులు జిల్లా కలెక్టర్ కు గురువారం పిర్యాదు చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ,భీముని మల్లారెడ్డి పేట గ్రామం మధ్యలో గత 100ఏళ్ల నుండి 1ఎకరం ఆభాది భూమిని ఉన్నదని, దాన్ని గ్రామస్థులు గ్రామ పండగలు, వరి దాన్యానం కొనుగోలు,వివాహ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకునే వారని తెలిపారు.2015 లో అప్పటి పాలక వర్గం అ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తే, అప్పటి కలెక్టర్ కు పిర్యాదు చేయగా,సంబంధిత అధికారులు వచ్చి అ ప్రక్రియను నిలిపివేశారని, నేడు, అదే భూమిని గ్రామంలోని కొంత మంది అమ్మే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.గ్రామ ప్రజలకు ఉపయోగంగా ఉన్న భూమిని అక్రమార్కుల నుండి తీసుకొని, ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు.

Leave a Reply

February 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
232425262728  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading