• సిరిసిల్లా నియోజక వర్గ ప్రజలకు తెలివి,ధైర్యం లేదా..?
• సిరిసిల్లా నియోజకవర్గం కేవలం రెడ్డి,రావులకేనా.?
• నేను గెలిస్తే మీరందరు ఎమ్మేల్యే నే!
నేటిభారతం( ప్రశ్నించడమే పరిష్కారం) :
దేశ స్వాతంత్ర్యం వచ్చిన 70 ఎళ్ళలో ఎనాడు సిరిసిల్లా నియోజకవర్గంలో ఒక్క బి.సి నాయకుడు ఏమ్మేల్యే కాలేదని లగిశేట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,గత 10 నెలల క్రితం బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ‘బండిసంజయ్ ‘ తనను పార్టిలోకి ఆహ్వనించి,సముచిత స్థానం కల్పిస్తామని హామి ఇచ్చారని తెలిపారు.సిరిసిల్లా నియోజకవర్గంలో రాబోయే ఏన్నికల్లో బి.సిల కు పెద్ద పీఠ వేస్తామని తెల్పడంతో, బిజెపి పార్టిలో క్రీయ శీల పాత్ర పోషించానని తెలిపారు.ఈ ఎన్నికల ముందు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన,నర్సంపేట వాస్తవ్యురాలైన రాణి రుద్రమ రెడ్డికి సిరిసిల్లా బిజెపి ఎమ్మేల్యే టికెట్ ఇచ్చి బి.సి లను మోసం చేశారని అగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లా నియోజకవర్గం లో 82%ఎస్సి,ఎస్టి,బిసి,మైనారిటిలు అత్యధుకులు ఉన్నప్పటికి, రెడ్డి,రావులే ప్రాతినిధ్యం వహించడం ఏంటని ప్రశ్నించారు.బి.సిలకు సముచిత స్థానం కల్పిస్తామని,మోసం చేసిన బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామ చేస్తున్నాని ప్రకటించారు.రాబోయే ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా భరిలో ఉంటానని తెలిపారు. సిరిసిల్లా ప్రజలకు తెలివి,దైర్యం,అవగాహన లేదా? అని ప్రశ్నించారు.తాను ఎమ్మేల్యే అయితే నియోజకవర్గంలోని ప్రజలందరు ఎమ్మేల్యేలేనని పేర్కొన్నారు.











Leave a Reply