కేటిఆర్ కో హటవో…..సిరిసిల్లా కో బచావో.

Published by

on

 * పాస్ పోర్ట్ దొంగ ముఖ్యమంత్రి కేసీఆర్ .

• కేసిఆర్ ఒడిపోతే రెస్ట్ తీసుకొనివ్వం.. చర్లపెల్లి జైళ్ళో వేస్తాం.

• తెలంగాణ లో బిసి అభ్యర్థులకు 60 శాతం  టిక్కెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ.

• కలలు కన్న తెలంగాణ రాలేదు. 

• ప్రగతి భవన్ లో బహుజనుడు కూర్చునే వరకు ఆగేది లేదు.

నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం) : 

కేటిఆర్ కో హటవో…..సిరిసిల్లాకో బచావోనని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో  బహుజన సమాజ్ పార్టి ఆధ్వర్యంలో,జూనియర్ కాలేజి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ,సిరిసిల్లా సింహ గర్జన లో  ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాట తప్పేదిలేదని, నడుమ తిప్పేది లేదని, అమ్ముడు పోయేది లేదని అన్నారు.  పాస్ పోర్ట్ దొంగ, ముఖ్యమంత్రి కేసీఆరని, కాళేశ్వరం కట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నాడని తెలిపారు.మేడి గడ్డ బ్యారేజ్ కట్టి, లక్షల కోట్లు దోచుకోవడానికి పన్నిన ప్లానే కాళేశ్వరమని అన్నారు. కెసిఆర్ ఓడిపోతే రెస్ట్ తీసుకొనివ్వమని,  ఎర్రవెల్లి ఫామ్ నుండి గుంజుకపోయి ,చర్లపెల్లి జైల్లో వేస్తామని తెలిపారు.

జైల్లో వేసే కార్యక్రమం సిరిసిల్ల నుండే పునాది వేశామని స్పష్టం చేశారు. తెలంగాణ లో బిసి అభ్యర్థులకు 60 శాతం  టిక్కెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బిఎస్పేనని కొనియాడారు.బిఎస్పీ అన్ని కులాలను అక్కున చేర్చకొని టిక్కెట్లు ఇచ్చిందని, వరంగల్ తూర్పు లో ఒక ట్రాన్స్జెండర్ ని నిలబెట్టిన ఘనత తమదేనని గుర్తుచేశారు .సిరిసిల్ల లో కేటీఆర్ కు ప్రభుత్వ అధికారులూ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని,అందుకే సభ అనుమతుల విషయంలో ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. ప్రగతి భవన్ లో బహుజనుడు కూర్చునే వరకు ఆగేది లేదని ఉద్గాటించారు.

పద్మశాలిలను మోసం చేసిన బిజెపి.

బిజెపి పద్మశాలిలను మోసం చేసి,రాణిరుద్రమ రెడ్డికి సిరిసిల్లా టిక్కెట్ ఇచ్చారని అన్నారు. ఆంధ్ర సభలకు ఎప్పుడైనా, వెళ్ళామా.? తెలంగాణ రావాలని, తెలంగాణ సభలకు వెళ్ళామని,కలలు కన్న తెలంగాణ రాలేదని, మీడియాలో వస్తున్న సర్వేలు దొంగవని, వాటిని ఎవరు నమ్మద్దని కోరారు. తెలంగాణ  మట్టిలో పుట్టిన బిడ్డలకు టిక్కెట్లు ఇస్తున్నామని,నిలబడ్డా అభ్యర్థులకు ఎలాంటి ఆస్తులు లేవని,వారే నిజమైన వారసులని అన్నారు. మరొకసారి దోపిడి దొంగలను గెలిపిస్తే దొరల గడీ పాలన వస్తుందని గుర్తుచేశారు.కేసిఆర్ పాలనలో మేడిగడ్డ లికు, లిక్కర్ లీకు, పేపర్ లీకు, ఈలాంటి లీకు వీరుడిని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

తెలంగాణ పై ఆత్మ గౌరమున్నవారు  తెలంగాణ దోపిడి దారుల సభలకు వెళ్ళవద్దు.

తెలంగాణ పై ఆత్మ గౌరం ఉన్నవారు తెలంగాణ దోపిడి దారులైన కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులు పెట్టే సభలకు వెళ్ళవద్దని, వారు దోచుకున్న సొమ్ము ఎక్కడ ఉన్నది అని నిలదీయాలని పిలుపునిచ్చారు. బహుజనులంత సర్వాయి పాపన్న, బెల్లీ లలిత వారసులని,మీరంత వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.కేటీఆర్ సిరిసిల్ల లో వేల ఎకరాలు అమ్ముకొని దందా చేస్తుంటే, కేసీఅర్,తన కోసం ప్రత్యేక మండలం ఏర్పాటు చేసుకొని, తన ఫాం హాజ్ కు ప్రత్యేక రోడు వేసుకున్నాడని, కామారెడ్డిలో నిలబడటానికి,వేములవాడ దేవుడి సొమ్ము కామారెడ్డికి తరలించుకెళ్ళజూసిన దొంగలను గెలిపిద్దామా అని ప్రశ్నించారు.హుజూరాబాద్ లో ఒక్క ముదిరాజ్ ను ఓడించాలని 500  కోట్లు ఖర్చు చేస్తే, మన జన బలం ముందు, కేసిఆర్ ధన బలం ఓడిపోయిందని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సైంటిస్టు గోలి మోహన్ ను వేములవాడ నియోజకవర్గం నుండి, బిడ్డ పిట్టల భూమేష్ కు సిరిసిల్లా నియోజకవర్గం నుండీ టిక్కెటిచ్చామని,వీరు గెలిచాక తప్పు చేస్తే,వాళ్ళ కాళ్ళు కట్టి మిడ్ మానేరులో వేస్తానని,నేనే తప్పు చేస్తే తుపాకితో కాల్చండని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఏస్పి మానకొండూర్  ఎమ్మేల్యే అభ్యర్థి, బిఏస్పి జిల్లా నాయకులు, ముదిరాజ్ నాయకులు,కార్యక్రలు,ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

November 2023
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading