గంజాయి రహీత జిల్లాగా మార్చడమే లక్ష్యం.

Published by

on

వాసన రాకుండా తయారు చేసిన గంజాయి ప్యాకెట్లు.

నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) :

గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు జరిపితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం.

• ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పి అఖీల్ మహజన్ .

 రాజన్న సిరిసిల్లా జిల్లాను గంజాయి రహీత జిల్లాగా మార్చడమే లక్ష్యమని  జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ, గంజాయి సేవిస్తూ, ఇతరులకు అమ్ముతున్న 4 యువకులను  అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో బట్ట రవీందర్ , అంకర్ ప్రణీత్,ఈగ కృష్ణ, అంకర్ హశ్విత్ లు ఉన్నారని, వీరందరు సిరిసిల్లా పట్టణానికి చెందిన వారని తెలిపారు. అంకర్ ప్రణీత్,ఈగ కృష్ణ, అంకర్ హశ్విత్ లు గంజాయి అలవాటు పడి , బట్ట రవీందర్ వద్ద నుండి గంజాయిని కొనుగోలు చేస్తుండగా,నమ్మదగిన సమాచారం మేరకు సిరిసిల్లా టౌన్ పోలిస్,టాస్క్ ఫోర్స్ పోలిస్ లు వారిని అదుపులోకి తీసుకొని, వారి నుండి 18 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధమున్న  మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, త్వరలో పట్టుకుంటామని తెలిపారు.జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు, జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికల రూపొందించిందని,ఎవరికై తగు సమాచారం లభిస్తే 100 కి గాని,ఎస్పి వాట్సప్ నెంబర్ కు గాని సమాచారం అందించాలని,సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని  కోరారు.

గంజాయి నిందితులను పట్టుకున్న జిల్లా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కట్ల రవీందర్,ఎస్.ఐ. రవీందర్ నాయుడు, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్స్ అక్షర్, మహిపాల్, శ్రీనివాస్,సిరిసిల్ల టౌన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ  ప్రత్యేకంగా అభినందించారు.

  భారీ మొత్తంలో పట్టుకున్న గంజాయిని సేవిస్తూ,అమ్ముతున్న 

*జల్సాలకు అలవాటు పడి అక్రమ గంజాయి రవాణా కేసులో నలుగురు నిందుతుల అరెస్ట్.*

*18 కిలోల  గంజాయి, 2 మోటార్ సైకిల్స్ స్వాధీనం.*

*జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్., గారు.*

*నిందితుల వివరములు:*

*1. బట్ట రవీందర్  s/o భూమయ్య, 35 సం.లు, నివాసము: అక్కాపూర్ గ్రామము, మాచారెడ్డి మండలం.*

*2.అంకర్ ప్రణీత్  s/o  మల్లేశం,  23 సం.లు, నివాసము: బి.వై. నగర్, సిరిసిల్ల.*

*3.ఈగ కృష్ణ s/o  భాస్కర్,  25 సం.లు, నివాసము: బి.వై. నగర్, సిరిసిల్ల.*

*4. అంకర్ హశ్విత్  s/o  మల్లేశం,  22 సం.లు,నివాసము: బి.వై. నగర్, సిరిసిల్ల. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.*

*మీడియా సమావేశంలో ఎస్పీ గారు మాట్లాడుతూ…*

సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రణీత్,కృష్ణ, హశ్విత్ లు గత కొన్ని రోజులుగా జల్సాలకు ఆలవాటు పడి గంజాయి తాగుతు, తమకు అవసరము పడ్డప్పుడల్లా ముగ్గురు కలిసి 

బట్ట రవీందర్ దగ్గర గంజాయి కొనుక్కొని తాగుతూ, గంజాయి తాగే వారికి అదిక రేటుకి అమ్ముచున్నారు. నాలుగు రోజుల క్రితం నిదితులు ప్రణీత్,కృష్ణ, హశ్విత్ లు బట్ట రవీందర్ దగ్గరికి గంజాయి గురించి వెళ్ళగా రవీందర్   వద్ద గంజాయి లేనందున ఒక్కొక్కరు 10 వేల రూపాయల చొప్పున ముగ్గురు కలిసి మొత్తం 30 వేల రూపాయలను రవీందర్ కు ఇచ్చినారు. రవీందర్  నాలుగు రోజుల తర్వాత గంజాయి తీసుకొని సిర్సిల్లకు వచ్చి మీకు అప్పగిస్తాను అని చెప్పడంతో A2 to A4 లు తిరిగి సిరిసిల్లకు వచ్చినారు. ఎప్పటి మాదిరిగానే ఈ రోజు అనగా తేదీ 11-11-2023నాడు మద్యాహ్నం అందాదా 14:00 గంటలకు సిరిసిల్ల శివారులోని మానేరు వాగు ఒడ్డున మున్నూరుకాపు సంగ  భవనం దగ్గరకు A3 యొక్క బైక్ పై A2 to A4 లు వెళ్ళి ఉండగా, అక్కడికి A1 మాచారెడ్డి నుండి తన బైక్ పై 18 కిలోల గంజాను ఒక్కొక్కటి 2 కిలోల ఉండే విదంగా 9 పాకెట్లు గా ప్యాక్ చేసుకొని వచ్చి A2 to A4 లకు అమ్ముచుండగా నమ్మదగిన సమాచారం మేరకు సిరిసిల్ల టాస్క్ఫోర్స్, సిరిసిల్ల టౌన్ పోలీస్ లు  వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి మొత్తం 18 కిలోల గంజాయి, రెండు బైక్ లను స్వాదీనం చేసుకోని నిందితులను రిమాండ్ కు తరలించనైనది.ఇట్టి గంజా కేసులో పరారీలో ఉన్న వ్యక్తిని త్వరలో పట్టుకోవడం జరుగుతున్నరూ. 

*గంజాయి నిందితులను పట్టుకున్న జిల్లా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ కట్ల రవీందర్,ఎస్.ఐ. రవీందర్ నాయుడు, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుల్స్ అక్షర్, మహిపాల్, శ్రీనివాస్,సిరిసిల్ల టౌన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.*

Leave a Reply

November 2023
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading